Telugu

మీడియా ముందుకు వివేకా కుమార్తె… కొత్త అనుమానాలు…

వైఎస్ వివేకానందరెడ్డి మరణం పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుబాటులో ఉన్న ఆధారాల బట్టి ఇది ఇంటి దొంగల పనే అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి, వైకాపా నాయకులు ఇప్పటికే దీని మీద రాజకీయం మొదలు పెట్టారు. ఈ హత్య చంద్రబాబు కుట్రే అని చెబుతున్నారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో లేని సంస్థ తో ఈ కేసును విచారణ చెయ్యాలని జగన్ హై కోర్టులో పిటిషన్ వేశారు.

అయితే ఉన్నఫళంగా వివేకా కుమార్తె, సునీతను తెర మీదకు తెచ్చారు. ఆమె కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చారు. ఒక స్క్రిప్టు లో ఇచ్చిన మ్యాటర్ ను చూసి చదవడం విశేషం. “వైఎస్‌ జగన్‌మోహనన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని నాన్న కోరిక. అందుకోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా రోజుల నుంచి పులివెందులలో ఒక్కరే ఉంటున్నారు. మా కుటుంబంలో గొడవలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. మా కుటుంబంలో అందరం కలిసే ఉంటాం,” అని ఆమె చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

కుటుంబాన్ని ఈ విషయంలోకి లాగవద్దని మీడియాని, రాజకీయ నాయకులని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే ఆమె పట్ల అందరికీ సానుభూతి ఉన్నా దీనికి కారణం ఎవరు అనేది గ్రహిస్తే మంచిది. ముందు గుండె పోటు అని చెప్పడం వల్లే కుటుంబసభ్యుల మీద అనుమానం మొదలయ్యింది. అదే సమయంలో జగన్, వైకాపా నాయకులు ముఖ్యమంత్రికి, లోకేష్ కి దీనికి లింకు పెట్టి రాజకీయం చెయ్యడం వల్లే వివాదాస్పదం అయ్యింది. మీడియాకు చెప్పే ముందు కుటుంబసభ్యులకు చెప్పుకోవాల్సింది. దానికి తోడు జగన్ ను సీఎంను చెయ్యాలని వివేకా కల అని అసందర్భంగా చెప్పడం కూడా పని గట్టుకుని కొందరికి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా ఉంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

BRS Firebrand In BJP Office, Something Cooking?

There is no shortage of twists and unexpected returns in Andhra Pradesh and Telangana politics.…

10 minutes ago

కవిత కొత్త పార్టీ పేరు ఇదే… బంతి ఇప్పుడు బీఆర్ఎస్‌ కోర్టులో!

ఇంతకాలం కేసీఆర్‌ కుమార్తెగా గుర్తింపు, గౌరవం పొందిన కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరించబడిన తర్వాత సొంతంగా గుర్తింపు…

18 minutes ago