
ఇంతకాలం కేసీఆర్ కుమార్తెగా గుర్తింపు, గౌరవం పొందిన కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన తర్వాత సొంతంగా గుర్తింపు సంపాదించుకొని రాజకీయలలో తన శక్తి సామర్ధ్యాలను నిరూపించుకునేందుకు సిద్దమవుతున్నారు. ఈ ప్రయత్నాలలో భాగంగానే సొంతంగా రాజకీయ పార్టీ స్థాపిస్తున్నారు.
ఈ నెల 25న ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లా, అవుటర్ రింగ్ రోడ్ సమీపంలో గల మునీరాబాద్ వద్ద గల ఓ ఫంక్షన్ హాల్లో కొత్త పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించబోతున్నారు.
కనుక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో ‘తెలంగాణ ప్రజా వికాస్ సమితి’ పేరుతో, ఆమె కటవుట్లతో స్వాగత తోరణాలు ఏర్పాటవడంతో రెండు రోజులు ముందుగానే కొత్త పార్టీ పేరు బయటపెట్టినట్లయింది.
ఇంగ్లీషులో ఈ పార్టీ పేరుని ‘టీపివిఎస్’ అవుతుంది. ఇది ‘టీఆర్ఎస్’కి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. తెలుగులో చెప్పుకుంటే పార్టీ పేరులో ముందు ‘తెలంగాణ’ చివర ‘సమితి’ పదాలున్నాయి. కనుక తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పేరుని పోలి ఉన్నట్లే.
కానీ కవిత ముందు చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పేరుని ఉపయోగించుకోలేదు. కనుక బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం చెప్పలేదు. పైగా తాము వదులుకున్న పేరుని కవిత తెలివిగా ఈవిధంగా వాడుకుంటున్నారని తెలుస్తున్నా చూస్తూ ఊరుకోవాల్సిందే.
రేపు పార్టీ ఆవిష్కరణ సభకి సుమారు 35,000 మంది వరకు పార్టీ కార్యకర్తలు పాల్గొంటారని, తెలంగాణ ప్రజలు కూడా భారీగా తరలివచ్చి తనని ఆశీర్వదించాలని కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.
Telangana politics are turning out to be extremely interesting in nature as we have multiple…
హైదరాబాద్ భారతీయ విద్యాభవన్ తరగతి గదుల్లో మొదలైన ఓ సాదాసీదా బాల్య స్నేహం, ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే…