Telugu

ఉన్నట్టుండి వైకాపా వారికి న్యాయవ్యవస్థపై ఇంత గౌరవం ఎందుకు వచ్చేసిందో?

న్యాయస్థానం నాన్ బెయిల్‌ నోటీసు కోర్టు ఇస్తే వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు కుట్రలు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు అంటూ… న్యాయవ్యవస్థను కించపరచాలా మాట్లాడుతున్నారు… ఆయన మాటలను సుమోటోగా కోర్టు పరిగణించాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

[m9ad]

ADVERTISEMENT

గతంలో ఇదే వైకాపా నాయకులు బాబు వ్యవస్థలను మానేజ్ చేసి స్టేలు తెచ్చుకున్నారని, సోనియా గాంధీతో చేతులు కలిపి జగన్ ను జైలులో పెట్టించారని ఆరోపించేవారు అప్పుడు గుర్తు రాని న్యాయవ్యవస్థపై గౌరవం సడన్ గా ఇప్పుడెందుకు గుర్తు వచ్చిందో మరి. అప్పుడు వారి మీద ఎన్ని కేసులు పెట్టాలో కూడా చెబితే బావుంటుంది కదా?

బాబ్లీ ప్రాజెక్టు కేసు సంబంధించి నాన్ బెయిల్ బుల్ వారెంట్ వస్తే ఎదో కుట్ర జరిగిపోతోందని టీడీపీ నేతలు డ్రామాలు ప్రారంభించారని… ఆ కేసును చూస్తే చంద్రబాబుకు శిక్ష కూడ పడని చెత్తకేసు అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తే పెట్టిన కేసుకు చంద్రబాబు మీదా పెట్టిన కేసుకు తేడా లేదన్న కరుణాకర్ రెడ్డి. ఇప్పుడు వైకాపా వారు బాబుకు ఎందుకు దైర్యం చెబుతున్నట్టు? లేక ఎక్కడ చంద్రబాబుపై ప్రజలకు సానుభూతి కలుగుతుందో అని భయమా?

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

IPL 2026: Big Auction Picks vs Brutal Reality Check

The 2026 season of the Indian Premier League is raising a key question. Are teams…

29 minutes ago

Pooja Hegde Disasters Keep Growing: Next Also Doubtful?

Following the back to back failures of Deva and Retro, Pooja Hegde is now awaiting…

49 minutes ago