Telugu

‘మిరపకాయ’ స్పెల్లింగ్ తెలియని ‘జగన్’

ముందుగా చెప్పిన ప్రకారమే… జగన్ రెండు రోజుల దీక్షను విజయవంతంగా ముగించారు. తొలి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమైన దీక్ష, మలి రోజు మధ్యాహ్నం నాలుగు గంటలకు శుభంకార్డు వేసి రెండు రోజుల దీక్షను పరిపూర్ణం చేసారు. ఈ దీక్షలో భాగంగా జగన్ కొత్తగా ఏం చేసారు అన్నది ఎవరికీ తెలియదు గానీ, రొటీన్ గా టిడిపి ప్రభుత్వంపై మరియు వ్యక్తిగతంగా చంద్రబాబుపై విమర్శలు చేసి, యధావిధిగా నిమ్మరసం తాగారు. అయితే జగన్ చేపట్టిన ఈ దీక్షపై ఆనం వివేకానందరెడ్డి తీవ్ర విమర్శలు చేసారు.

‘మిరపకాయ’ స్పెల్లింగ్ కూడా తెలియని వ్యక్తి, మిర్చి రైతుల తరపున రెండు రోజుల దీక్ష చేయడమేంటి… అని జగన్ ను ఎద్దేవా చేసారు. మిర్చి గురించి తెలియని పిల్లోడుగా జగన్ ను అభివర్ణించిన ఆనం, ‘ఒంగోలు గిత్త’లో ప్రకాష్ రాజ్ మాదిరి జగన్ ప్రవర్తిస్తున్నాడని తీవ్ర పదజాలంతో స్పందించారు. ఆ సినిమాలో మిర్చి యార్డు ఛైర్మన్ గా నటించిన ప్రకాష్ రాజ్… ఉదయాన్నే తయారై ప్రజల ముందుకు వస్తాడని… ప్రజల బాధలు విని కన్నీరు పెట్టుకుని, సాయంత్రం ఇంటికెళ్లి గుడ్డలిప్పి కూర్చుని మందుకొడతాడని… దీక్ష ముగిసిన తర్వాత లోటస్ పాండ్ లో జగ కూడా అలా కూర్చుంటాడా? అంటూ మండిపడ్డారు.

ADVERTISEMENT

‘రాష్ట్రమనే పచ్చని చెట్టుకు పట్టిన చీడపురుగు జగన్ అని, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెనకేసుకుని ప్రజల కళ్లల్లో మిర్చి పొడి కొట్టిన జగన్, ఇప్పుడు గుంటూరులో కూర్చుని ‘జపం జపం జపం కొంగ జపం’ చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఏ సమస్య పైన అవగాహన లేని జగన్ కు, రైతుల సమస్యలు ఒక్కటైనా తెలియదని, తాము తెలుగుదేశం పార్టీని వీడి వైకాపాలో చేరుతామని వచ్చిన వార్తలన్నీ నిరాధారాలేనని, మీడియా సృష్టేనని కొట్టిపాడేసారు.

మిర్చి గురించే తెలియని పిల్లోడు జగన్ నీతులు చెబుతున్నాడని మండిపడిన ఆనం వివేకా, రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా ‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే… నేను ముఖ్యమంత్రినైతే..’ అంటూ పదే పదే ఆంధ్రప్రదేశ్ లో అంటున్నాడు కనుక సరిపోయిందనికాని, ఈ విషయం 56 అంగుళాల ఛాతీ కలిగిన ప్రధాని మోడీ దగ్గర అంటే జగన్ జీవితాంతం జైల్లోనే ఉంటాడని, సెటైర్లు వేస్తూ పగలబడి నవ్వారు. వైఎస్ ప్రభుత్వంలో అవినీతి ఉందని సర్వేలో తేలిందని, చంద్రబాబు రాష్ట్రానికి మంచి పేరు తెస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Sujeeth Doing Overtime, But Can PK Match It?

The last time, Pawan Kalyan delivered a good theatrical experience to a reasonable extent was…

7 minutes ago

Pics: Nimrit Kaur Flaunts Sultry Grace In Blue Saree

Nimrit Kaur is redefining raw ethnic elegance with an earthy, unapologetically sultry photoshoot that is…

27 minutes ago