Telugu

వైరస్ కౌంట్ పూర్తిగా తగ్గేవరకు ట్రీట్‌మెంట్ చేయాల్సిందే!

దగ్గు, జలుబు, జ్వరం వంటి చిన్న వ్యాధులకు ఒకసారి చికిత్స చేయించుకుంటే తగ్గిపోతాయి. కానీ క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన మొండి వ్యాధులకు ఒక్కసారి ట్రీట్‌మెంట్ చేస్తే తగ్గవు. తగ్గే వరకు చేస్తూనే ఉండాలి. అయిన కొన్నిసార్లు ప్రాణాలు కాపాడటం కష్టం.

ఏపీలోఇలాంటి వ్యాధి లక్షణాలతోనే కొంతమంది బాధపడుతున్నప్పుడు వారి వైరస్ కౌంట్ 151/175 ఉండేది. అది క్రమేపీ 175/175కి చేరుకుంటుందని రోగి అనుమానపడుతూ ఉండేవాడు.

ADVERTISEMENT

అయితే ప్రజావైద్యశాలలో దానికి మంచి ట్రీట్‌మెంట్ ఇచ్చి కట్టడి చేసి151/175 నుంచి ఒకేసారి 11/175కి దించేశారు. వైరస్ లోడ్ కౌంట్ ఒకేసారి ఇంతగా తగ్గడంతో ఇక మనకు డోకా లేదనుకున్నారు.

కనుక గంగమ్మ జాతర మొదలుపెట్టారు. రప్పా రప్పా అంటూ గొర్రెలు, మేకలు, కోళ్ళు నరికి రక్తాభిషేకాలు చేసుకున్నారు.

కరోనాలా ఈ వైరస్ కూడా మళ్ళీ తిరగబెట్టిందని పోలీసులు గ్రహించారు. వైరస్ తాపంతో ఆవేశంతో ఊగిపోతున్నవారందరికీ మళ్ళీ క్వారన్‌టైన్ చేసి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు.

కానీ అలాంటి రోగులతో తెలిసో తెలియకో కాంటాక్ట్ అయితే అందరికీ ‘రప్పారప్పా అంటు వ్యాధి’ వ్యాపించే ప్రమాదం ఉంటుంది.

కనుక ఆ రోగంతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులను అందరూ గుర్తించేందుకు పోలీసులు వారిని రోడ్లపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్లకు తీసుకువెళుతున్నారు. అప్పటికీ పోలీసులు వారి గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఉండేందుకు ‘జస్ట్ రౌడీ షీటర్స్’ అనే నిక్ నేమ్‌ పెట్టి మర్యాదగా చూసుకుంటూనే ఉన్నారు.

వారిని చూస్తున్న ప్రజలు ఇప్పటికే ఈ వైరస్ ఆంధ్రా అంతటా వ్యాపించిపోయింది. కనుక ఏదో ఒక్క ఊర్లో కొందరికి ట్రీట్‌మెంట్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటే అది బాధ్యతారాహిత్యమే. పూర్తిగా నయమయ్యే వరకు ‘రప్పా రప్పా రోగులందరికీ’ ఆరోగ్యశ్రీ లేదా మరో పధకం కింద ఉచితంగా ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.

కరోనా లాంటి మొండి జబ్బుకి మూడుసార్లు యాంటీ వైరస్ ఇంజక్షన్లు పొడిపించుకుంటే గానీ తగ్గలేదు. అలాంటిది ప్రాణంతకమైన ‘రప్పారప్పా వ్యాధికి’ ఒక్క డోస్ ఏ మూలకి? ఇది న్యాయమా? అంటూ జనం ఆవేదన చెందుతున్నారు. వింటున్నారా బాబుగారూ?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Samyuktha’s TBG Shot With Multiple Cameras

Tollywood’s lucky charm Samyuktha, who is busy with multiple projects, is doing a female-oriented film…

16 minutes ago

Jagapathi Babu’s Vadhala Teaser Sets Up A Mystery

The teaser of the forthcoming venture Vadhala starring Jagapathi Bbau takes a completely different route…

29 minutes ago