
రిజర్వేషన్లను త్వరగా అమలు చేసే విషయంలో ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలన్న అంశాన్ని చర్చించారు. తూతూమంత్రంగా బంద్ లు, రాస్తారోకోలు నిర్వహించడం కాకుండా కాస్త గట్టిగానే ఉద్యమించాలని కాపు నేతలు నిర్ణయించారు. కాపు ఉద్యోగులపై వివక్ష కొనసాగుతోందని భేటీలో పాల్గొన్న కొందరు నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. సెప్టెంబరు 11వ తేదీన రాజమండ్రిలో 13 జిల్లాల కాపు సంఘాల నేతలతో ముద్రగడ సమావేశం నిర్వహించనున్నారు.
సమావేశం అనంతరం రిజర్వేషన్ల కోసం కార్యాచరణ ప్రకటిస్తామని కాపునేత ముద్రగడ తెలిపారు. ‘ప్రభుత్వం ఇస్తున్న హామీలనే అడుగుతున్నాం. దీంతో మాపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ విషయం తేల్చకుండా ఏదోదో మాట్లాడడం సరికాదు. 11వ తేదీన మీటింగ్ ఉంది. ఆ తర్వాత ఆందోళన ఎలా చేయాలనే దానిపై అందరి అభిప్రాయాలు తీసుకుంటాం’ అని ముద్రగడ పేర్కొన్నారు. ఆయన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఆయన ఒంటరి కాదని, ఆయన వెంట మేమున్నామని అంబటి రాంబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Dulquer Salmaan’s I’m Game has not found the expected traction in the Telugu states. The…
Rashmika Mandanna, who recently took a break from work after suffering a hip injury, has…