
వచ్చే ఎన్నికలలో వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే చాలా గొప్ప విషయమే. జనసేనాని పవన్ కళ్యాణ్ నీతి, నిజాయితీలను ఎవరూ ప్రశ్నించలేము. వచ్చే ఎన్నికలలో ఆయన, టిడిపితో కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నాను. వచ్చే ఎన్నికలలో నేను వైసీపీలో ఉండను. వేరే పార్టీ తరపున పోటీ చేస్తాను. వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీతా రెడ్డి చాలా ధైర్యంగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. అందుకు ఆమెని అభినందిస్తున్నాను. ఆయన హత్య కేసులో ఎప్పటికైనా హంతకులకి శిక్షలు తప్పవు. అప్పుడు చాలామంది జైలుకి వెళ్ళక తప్పదు,” అని అన్నారు.
వైసీపీకి కంచుకోటగా చెప్పుకోబడే కడప జిల్లాలో ఇద్దరు సీనియర్ వైసీపీ నేతలు జగన్ తీరుతో విసుగెత్తిపోయి టిడిపిలో చేరేందుకు సిద్దమవుతున్నారు. మైదాకూరు మాజీ ఎమ్మెల్యే డిఎల్ రవీంద్ర రెడ్డి వైఎస్సార్ క్యాబినెట్లో మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. ఆయనపై అభిమానంతోనే వైసీపీలో చేరారు. కానీ ఇప్పుడు సిఎం జగన్ వైఖరి నచ్చక టిడిపిలో చేరాలనుకొంటున్నారు.
కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి మొదట టిడిపిలోనే ఉండేవారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికలలో ఆయన పోటీ చేయలేదు కానీ వైసీపీకి మద్దతు ప్రకటించారు. కానీ ఆయన కూడా సిఎం జగన్ వైఖరి నచ్చక టిడిపిలో చేరేందుకు సిద్దపడుతున్నారు. కొన్ని రోజుల క్రితమే నారా లోకేష్తో వీరశివా రెడ్డి భేటీ అయ్యారు. నేటికీ వైసీపీ ఎంపీగా కొనసాగుతున్న రఘురామకృష్ణ రాజు నిత్యం సిఎం జగన్మోహన్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. వైసీపీలో సిఎం జగన్ తీరు, నిర్ణయాలు నచ్చని వారు ఇంకా ఎందరున్నారో? వచ్చే ఎన్నికలలోగా ఇంకా ఎంతమంది వైసీపీని వీడుతారో?
—
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…