
2019 ఎన్నికలలో టిడిపితో విభేధించి జనసేన ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయింది. టిడిపి కూడా ఓడిపోయింది. అంటే తాము కలిసి పనిచేస్తే అధికారంలోకి రాగలమని, విడిపోతే నష్టపోతామని రెండు పార్టీలు గ్రహించాయి. వాటితో పాటు వైసీపీ కూడా ఈ విషయం గ్రహించింది. ఒకవేళ ఆ రెండు పార్టీలు మళ్ళీ కలిస్తే వైసీపీ ఓడిపోతుందని అర్దమైంది కనుకనే ఆ రెండు పార్టీలు దగ్గరవకుండా ఉంచేందుకు వైసీపీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తుంటారు.
చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ ఊడిగం చేస్తున్నాడని, ఆయనకి దత్త పుత్రుడని పదేపదే అవహేళన చేయడం ఆ ప్రయత్నాలలో భాగమే. పవన్ కళ్యాణ్‌కి దమ్ముంటే 175 సీట్లు పోటీ చేస్తానని ప్రకటించాలని సవాళ్ళు విసరడం కూడా అందుకే. వైసీపీ నేతలు మరోవైపు కాపులని కూడా రెచ్చగొడుతూ వారు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గుచూపకుండా అడ్డుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. పవన్ కళ్యాణ్‌కి ఓట్లేస్తే వాటిని ఆయన చంద్రబాబు నాయుడుకి తాకట్టు పెడతారనే వైసీపీ నేతల వాదనలు అటువంటివే. అయితే వైసీపీలో కాపు నేతలందరూ సిఎం జగన్మోహన్ రెడ్డి పల్లకీ మోస్తూ, పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తుండటమే చాలా విడ్డూరం.
టిడిపి, జనసేనలు చేతులు కలిపితే వైసీపీ అధికారం కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైసీపీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు పార్టీలో అందరూ గట్టిగా నమ్ముతున్నందునే వారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల కలయికని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అర్దమవుతూనే ఉంది.
హైదరాబాద్‌లో నిన్న వారిరువురూ భేటీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, “వారిదో అపవిత్ర బందం. ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి రాష్ట్రంలో వెంటిలేటర్ మీద ఉన్నపార్టీలన్నీ కట్టకట్టుకొని వస్తున్నాయి. ఒకవేళ వాటితో బిజెపి కూడా చేరితే అప్పుడు సీపీఐ రామకృష్ణ ఏమని చెపుతారో?వెంటిలేటర్ మీదున్న ఆ పార్టీలు ముందస్తు ఎన్నికలు జరగాలని కోరుకొంటే ముందస్తు ఎన్నికలు రావు. 2024లో షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. ఇంకా ఎన్ని పార్టీలు కట్టకట్టుకు వచ్చినా వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం వాటి తరం కాదు,” అని అన్నారు.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…