Telugu

జైలు నుండే జగన్ కు మద్దతు

నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి సిబిఐ కేసులో బెంగుళూరు జైలులో ఉన్నారు. అరెస్టు అవ్వగానే వాకాటిని పార్టీ నుంచి టిడిపి నాయకత్వం సస్పెండ్ చేసింది. .దాంతో ఆయన వర్గం టిడిపిని వదలి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లాలని యోచిస్తోంది. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వారితో సంప్రదింపులు కూడా జరిపారు.

ఆనం కూడా టిడిపికి గుడ్ బై చెబుతున్న సంగతి తెలిసిందే. తొందర్లోనే మంచి రోజు చూసుకుని ఆనం వైకాపాలో చేరబోతున్నట్టు సమాచారం. ఆయనతో పాటు వాకాటి వర్గం కూడా వైకాపా తీర్థం పుచ్చుకుంటారట. వాకాటి జైలు నుండి జగన్ కు మద్దతు తెలపనున్నారని సమాచారం. మరోవైపు ఆనంను ఎలాగైనా బీజేపీలోకి తీసుకుని రావాలని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రయత్నిస్తున్నారట.

ADVERTISEMENT

ఆనం, కన్నా సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో కలిసి పని చేశారు. ఇద్దరు ఒకేసారి మంత్రులుగా కూడా ఉన్నారు. అయితే రాష్ట్రవిభజన అనంతరం కాంగ్రెస్ రాష్ట్రంలో తుడుచుపెట్టుకుపోవడంతో ఇద్దరు తలో దారి అన్నట్టు వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్ళీ కలిసి బీజేపీలో పనిచేస్తారా అనేది చూడాలి.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Pawan Kalyan Vs Vijay: CBN’s Perfect Analysis!

AP chief minister Chandrababu Naidu has been around the political Arena for more than 4…

14 minutes ago

ఆయుధ నిల్వలు లేక ఉదారంగా యుద్ధ విరమణ!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ పదవి, తిరుగులేని అధికారం, అహంకారం, అగ్రరాజ్యమనే దురహంకారం వల్లనే ఇంత ధైర్యంగా వరుసగా తప్పులు…

19 minutes ago