
ఈ నేపథ్యంలో డాక్టర్ దగ్గుబాటి పోకడపై పార్టీ అధిష్టానం దృష్టి సారించడంతో పాటు సీఎం జగన్ కూడా ఆరా తీయటం, ఇంటెల్సిజెన్స్ శాఖ అధికారులు ప్రత్యేకంగా ఆ నియోజకవర్గ సమాచారాన్ని పసిగడుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోనే ఆయా ప్రాంతాల్లో పాల్గొన్న పార్టీ సమావేశాల్లోను మీడియా సమావేశాల్లోను పురందేశ్వరి కూడా తీవ్రస్థాయిలో ప్రభుత్వ నిర్ణయాలను దుయ్య బట్టారు. ఆమె చేసిన వ్యాఖ్యానాలు వైసీపీ నేతల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఈ క్రమంలో జగన్, దగ్గుబాటి మధ్య అంతరం పెరుగుతుందని సమాచారం. పార్టీలో చేరకముందే పురంధేశ్వరి రాజకీయ ప్రస్థాన్ని తాను ప్రభావితం చెయ్యబోనని చెప్పినా ఇప్పుడు ఆ విషయాన్ని తెరమీదకు తేవడం దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు నచ్చడం లేదంట. నియోజకవర్గ ఇంఛార్జ్ మీదే నిఘా పెడితే పార్టీ అంతా ఒకతాటి మీదకు ఎలా వస్తుందని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. ఇదంతా ఎందుకు బీజేపీలోకి వెళ్తే ఏ గొడవా ఉండదు కదా అని కూడా కొందరు సలహాలు ఇస్తున్నారట.
A new inside news related to a big budget Pan-India South movie has surfaced online.…