Telugu

మేకపాటీ… దమ్ముంటే రా… వైసీపీ వెయింటింగ్ ఇక్కడ!

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలతీరు చూసి ప్రజలు కూడా చీదరించుకొంటున్నారు. ఇంతకాలం పార్టీలో అంతర్గతంగా కుమ్ములాడుకొనే వైసీపీ నేతలు, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీలో నుంచి సస్పెండ్ చేయడంతో అందరూ ఇప్పుడు రోడ్లెక్కి కుమ్ములాటలకు సిద్దం అవుతున్నారు.

వైసీపీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ యాదవ్‌ చేసిన విమర్శలకు మేకపాటి కూడా అంతే ధీటుగా సమాధానం ఇచ్చారు. ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాలు పెడితే తరిమి కొడతామని ఆయన వ్యతిరేక వర్గం హెచ్చరించడంతో, నిన్న ఉదయం ఆయన తన అనుచరులతో కలిసి వచ్చి బస్టాండ్ సెంటర్ వద్ద నడిరోడ్డుపై కుర్చీ వేసుకొని “ఇదిగో వచ్చా… ఎవరోస్తారో రండి చూసుకొందాం,” అంటూ ప్రతిసవాలు విసిరారు.

ADVERTISEMENT

అప్పుడు వైసీపీ నేతలు పట్టణంలోనే ఉన్నప్పటికీ అందరూ మొహం చాటేశారు. శుక్రవారం ఉదయం వైసీపీ నేతలు భాస్కర్‌ రెడ్డి, సుబ్బారెడ్డి తమ అనుచరులతో కలిసి బస్టాండ్ సెంటర్ వద్దకు చేరుకొని రోడ్డుపై కుర్చీలు వేసుకొని “మేకపాటీ… ఇదిగో మేము వచ్చాము… దమ్ముంటే రా… అమీతుమీ తేల్చేసుకొందాము,” అంటూ సవాళ్ళు విసురుతున్నారు.

ఈ విషయం తెలుసుకొని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా తన అనుచరులతో అక్కడకు చేరుకొంటే వారి మద్య పెద్ద గొడవ జరిగే ప్రమాదం ఉంటుంది కనుక పోలీసులు వైసీపీ నేతలకు నచ్చజెప్పి పంపించేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా బస్టాండ్ సెంటర్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

మేకపాటీ… ఆ ఇంటి పేరు వదిలేసుకో: విక్రమ్ రెడ్డి

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతితో ఆయన స్థానంలో ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన సోదరుడు, మేకపాటి విక్రమ్ రెడ్డి కూడా బాబాయ్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సవాళ్ళు విసురుతున్నారు. విక్రమ్ రెడ్డి ఆత్మకూరులో మీడియాతో మాట్లాడుతూ, “నేను అసంతృప్తిగా ఉన్నానని, పార్టీ మారుతున్నానని టిడిపి మైండ్ గేమ్ ఆడుతోంది. కానీ నేను ఎప్పటికీ సిఎం జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తాను. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి దమ్ముంటే తన ఇంటి పేరు, పార్టీ పేరు చెప్పుకోకుండా వచ్చే ఎన్నికలలో పోటీ చేసి గెలవాలని సవాలు చేస్తున్నాను. మేకపాటి-వైఎస్ఆర్‌ కుటుంబాల మద్య బలమైన సంబందాలున్నాయి. కనుక ఆయనతో పాటు అందరం వెంట వచ్చేస్తామనుకోవడం సరికాదు. వచ్చే ఎన్నికలలో నెల్లూరు జిల్లాలోని 10 స్థానాలు గెలిచి సిఎం జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తాను,” అని మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

మంత్రి పదవి చేపట్టాల్సిన వంగవీటి మేయర్ పదవికి పోటీ!

ఇటీవల జనసేన పార్టీలో చేరిన వంగవీటి రాధాకృష్ణకు అందరూ ఊహించినట్లే ఆ పార్టీ మేయర్ అభ్యర్ధిగా అవకాశం దక్కించుకున్నారు. వంగవీటి…

20 minutes ago

Is NTR the Missing Piece in Nelson-Anirudh’s Next?

Naga Vamsi has confirmed a film with director Nelson Dilipkumar and music composer Anirudh Ravichander…

24 minutes ago