
“సీఎం జగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది..?..తిరుమల వెంకన్న గుడికి వెళ్లాలంటే టీడీపీ-బీజేపీ సభ్యత్వాలు తీసుకోవాలా..? లేక కమ్మ కులంలో పుట్టాలా..? డిక్లరేషన్ విషయంలో మరోసారి మాట్లాడితే ఇప్పుడు తిట్టిన దాని కంటే ఎక్కువగా తిడతా…ఇప్పటికంటే పచ్చిగా తిడతా,” అంటూ బ్లాక్ మెయిల్ కు దిగారు మంత్రి.
“నా పేరు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు.. వెంకన్న తన కుల దైవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు తన కొడుకు కానీ మనవడికి కానీ వెంకన్న పేరెందుకు పెట్టలేదు..? తండ్రిని సీఎం చేసిన వెంకన్న కొడుకునూ సీఎం చేశాడు…వైఎస్ కుటుంబానికే ఆ అదృష్టం దక్కింది. చంద్రబాబు ఎంత లుచ్చానో అనే విషయాన్ని ప్రజలకు అర్ధం కావడానికే అలిపిరి ఘటనలో చంద్రబాబును వెంకన్న బతికించాడు,” అంటూ రెచ్చిపోయారు.
“అలిపిరి ఘటనలో చంద్రబాబు చనిపోయి ఉంటే…విగ్రహాలు కట్టి దేవుడ్ని చేసేవారు అది వెంకన్నకు ఇష్టం లేదు,” అని చెప్పుకొచ్చారు. మంత్రులు విచక్షణ కోల్పోయి ఏం మాట్లాడుతున్నారో తెలీకుండా మాట్లాడుతున్నా, వారు ఉపయోగించే భాష మీద నిరసనలు వ్యక్తం అవుతున్నా ముఖ్యమంత్రి వారిని కనీసం వారించకపోవడం విశేషం.
Union Minister and Karimnagar MP Bandi Sanjay’s son Bandi Bhageerath had been in the news…
The trailer for Dharma Productions' upcoming film Chand Mera Dil has been dropped and it…