
గుంటూరు జిల్లాలో వైసీపీ ఇన్‌ఛార్జి మేకతోటి సుచరిత, తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి మద్య ఇంతకాలంగా జరుగుతున్న కోల్డ్ వార్ నిన్నటితో ముగిసింది. అంటే ఇద్దరి మద్య సయోధ్య కుదిరిందని కాదు. ఇద్దరి మద్య గొడవలు రోడ్డున పడ్డాయి.
తన నియోజకవర్గంలో తనకు తెలియజేయకుండా అదనపు ఇన్ఛార్జిగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించడంతో ఈ గొడవ మొదలైంది. ఎమ్మెల్యే శ్రీదేవి శుక్రవారం రాత్రి తన అనుచరులతో కలిసివచ్చి సుచరిత ఇంటి ముందు బైటాయించి ధర్నా చేశారు. అయితే ఆ సమయానికి ఆమె ఇంట్లో లేకపోవడంతో తన ఇంటి ముందు ఎమ్మెల్యే శ్రీదేవి ధర్నా చేస్తున్న సంగతి ఆమెకి తెలియలేదు. తెలుసుకొన్న వెంటనే హడావుడిగా ఇంటికి చేరుకొని ఎమ్మెల్యే శ్రీదేవికి నచ్చజెప్పి ఇంట్లోకి తీసుకువెళ్ళి మాట్లాడేందుకు ప్రయత్నించారు.
కానీ శ్రీదేవి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నాకు చెప్పకుండా నా నియోజకవర్గంలో డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను అదనపు ఇన్ఛార్జిగా ఎందుకు నియమించారో సమాధానం చెప్పాలంటూ గట్టిగా నిలదీశారు. సుచరిత సంజాయిషీలతో సంతృప్తిచెందని ఎమ్మెల్యే శ్రీదేవి అర్దరాత్రివరకు తన అనుచరులతో కలిసి ఆమె ఇంటి ముందు ధర్నా కొనసాగించారు. చివరికి సుచరిత క్షమాపణలు చెప్పుకొన్నాక ఎమ్మెల్యే శ్రీదేవి శాంతించి శనివారం సాయంత్రంలోగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను ఆ పదవీలో నుంచి తొలగించాలని వార్నింగ్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయారు.
డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను తప్పించకపోతే తాడికొండలోని నాలుగు మండలాలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేస్తామని సుచరితను హెచ్చరించారు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆమె పార్టీ అధిష్టానం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు.
Venkatesh-Trivikram's Aadarsha Kutumbam AK47 is now expected to arrive in theatres on October 30, after…
Bigg Boss Telugu is one of the most entertaining reality shows in the world. The…