
దానికి చంద్రబాబు పాదయాత్ర ప్రధానంగా కారణం అయితే గాలి తెలుగు దేశం వైపు వీచింది మాత్రం 2013 జూన్ లో ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు వారిని చంద్రబాబు స్వయంగా వెళ్లి సురక్షితంగా తీసుకొచ్చారు. అప్పటినుండి ప్రజలు చంద్రబాబును పాజిటివ్ గా చూడటం మొదలు పెట్టారు. అయితే ప్రస్తుత విషయానికి వస్తే నిన్న ఇబ్రహీంపట్నం ఫెర్రిఘాట్ దగ్గర బోటు ప్రమాదం జరిగింది.
ఇప్పటివరకు 19కి చేరిన బోలు ప్రమాద మృతుల సంఖ్య. గాలింపు చర్యలు జరుగుతుండగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, మైలవరం ఇన్‌చార్జ్ జోగి రమేష్ అక్కడకి వచ్చి హల్చల్ చేసారు. గాలింపు చర్యలు జరగనివ్వకుండా అడ్డు తగిలారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అంబులెన్సు ను రానివ్వకుండా అడ్డు తగిలారు.
పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ వారిని తీవ్రంగా మందలించారు. కేసులు పెడతాం ఇలా అయితే అని హెచ్చరించారు. ఈలోగా అక్కడకి చేరిన వైకాపా శ్రేణులు ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలు మొదలు పెట్టారు. బాధితులు కొండంత విషాదంలో ఉండగా రాజకీయ నాయకులు చేస్తున్న హడావుడి తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
తాము పోలిసుల కంటే ముందు వచ్చాము అని చెప్పుకొచ్చిన జోగి రమేష్, పార్థసారథి శవరాజకీయాలు మాని సహాయ చర్యల పై దృష్టి పెట్టి ఉంటే ప్రజలు హర్షించేవారు. అయితే వారు కనీస బాధ్యత మరిచి ఇంకా గాలింపు జరుగుతుండగానే రాజకీయాలు మొదలు పెట్టారు. విజ్ఞులైన ప్రజలు ఇలాంటివి హర్షిస్తారు అనుకుంటే అది పొరపాటే అవుతుంది.
Hanuman Ansh has emerged as an unexpected blockbuster at the box office. Despite the success…
నాని కెరీర్‌లోనే అతి పెద్ద సినిమా Paradise. ఆర్థికంగా కూడా ఈ సినిమా టీమ్‌కు చాలా కీలకం. అందుకే ప్రతి…