
ఇన్ని లక్షల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించటం చాలా కష్టసాధ్యం. ఈ క్రమంలో అర్హుల ఓట్లు గల్లంతై, అనర్హుల ఓట్లు జాబితాలో మిగిలిపోయే ప్రమాదం ఉంది. వచ్చిన దరఖాస్తులపై క్షేత్ర పరిశీలన చేసిన ఎన్నికల సంఘం..అందులో అత్యధిక శాతం దరఖాస్తులు నకిలీవేనని గుర్తించింది. ఓటర్లు ఆయా గ్రామాల్లోనే నివాసముంటున్నప్పటికీ వారికి తెలియకుండానే మోసపూరితంగా ఎవరో వ్యక్తులు ఇలా నకిలీ దరఖాస్తులు పెట్టారని తేల్చింది. దీని బట్టి ఇవన్నీ బోగస్ అప్లికేషన్లని తెలుస్తుంది.
దీనితో వైఎస్సార్ కాంగ్రెస్ టీడీపీ ఓటర్లనే లక్ష్యంగా ఈ అప్లికేషన్లు పెట్టిందని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ ఘటనలకు పాల్పడిన వారిని గుర్తించాలంటూ క్రిమినల్ కేసులు పెట్టింది. స్థానికంగా ఆయా తహసీల్దార్ల ఫిర్యాదుల మేరకు ఎక్కడికక్కడ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇలాంటి ఘటనలపై మంగళవారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 232 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు జగన్ స్వయంగా ఒప్పుకోవడంతో ఈ కేసులలో వైఎస్సార్ కాంగ్రెస్ ఇబ్బంది పడొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Sanjay Leela Bhansali recently confirmed the release date of Love & War, bringing relief to…
A student on an F-1 visa secured an internship with Amazon, but the opportunity soon…