
ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి, కలిసి పోటీచేయడానికి తేడా ఉందని రాజ్యసభ సభ్యుడు జగన్ ఆంతరంగికుడైన విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇస్తే వైసీపీ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తుందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన మీడియాతో అన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమని మాత్రమే తమ పార్టీ అధినేత జగన్ పేర్కొన్నారని చెప్పారు. టీడీపీ తమపై బురద చల్లే యత్నం చేస్తుందని ఆయన అన్నారు. బిజెపితో కలిసి ఉన్నవాళ్లు తమపై ఆరోపణలు చేయడం విచిత్రంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
గడిచిన 48 గంటల్లో ఏం మార్పు వచ్చిందని వైకాపా తన నిర్ణయం మార్చుకుందో మరి? అనాలోచితంగా జగన్ నేషనల్ మీడియాతో మాట్లాడేశారా? లేక ఎందుకన్న మంచిదని విజయ సాయి రెడ్డితో వేరేగా మాట్లాడిస్తున్నారా? జరుగుతున్న పరిణామాలన్నీ బీజేపీ నిశితంగా పరిశీలిస్తుంది.
Jailer 2 is back in the news for an interesting reason. Rajinikanth had recently said…
దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టులో నిన్న నీళ్ళు పారాయి. అలాగే దశాబ్దాలుగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న గోదావరి జలాలు పోలవరం…