
ఓటు బ్యాంక్ రాజకీయాలలో భాగంగా గత మూడున్నరేళ్ళుగా సంక్షేమ పధకాలు కొనసాగుతున్నాయి. వాటితో లబ్దిదారుల జీవితాలు మారిపోవని అందరికీ తెలుసు. కానీ పధకాలు పొందినవారందరూ వైసీపీకి మాత్రమే ఓట్లు వేయాల్సి ఉంటుంది. సిఎం జగన్మోహన్ రెడ్డి సభలు, సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావలసి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వారందరి బ్రతులు వైసీపీకి తాకట్టుపెట్టుకొని డబ్బు తీసుకోతున్నట్లే లెక్క. ఇది నయాన్న జరిగే ఓటు బ్యాంక్ రాజకీయాలు కాగా భయాన్న జరిగే రాజకీయాలే ఫ్యాక్షన్ రాజకీయాలు. రాష్ట్రంలో ఎవరూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. వ్యతిరేకించకూడదు. ప్రజాస్వామ్యం, భావప్రకటన స్వేచ్చ పేరుతో సభలు, సమావేశాలు నిర్వహించుకొంటే చిత్తూరు జిల్లా పుంగనూరులో జనసేన నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్కి జరిగిన చేదు అనుభవమే ఎదురవుతుంది.
ఆయన మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి నియోజకవర్గంలో రైతుల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేందుకు నిన్న ఆదివారం ‘రైతు భేరి’ సభ నిర్వహించాలనుకొన్నారు. కానీ దానికి అనుమతి లేదని పోలీసులు ఆయనని అడ్డుకొన్నారు. అంతటితో ఈ కధ ముగిసిపోలేదు. ఆదివారం రాత్రి పుంగనూరు పట్టణంలో కొత్తిండ్లులోని ఎల్ఐసీ కాలనీలో ఆయన ఇంటిపై వైసీపీ కార్యకర్తలు రాళ్ళు, కర్రలు దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. కుర్చీలు, పూల కుండీలు, కిటికీ అద్దాలు పగులగొట్టారు. ఇంటి ఆవరణలో ఉన్న కార్లపై కూడా దాడులు చేశారు. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నారు కానీ వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు. ఇంటి లోపల రామచంద్ర యాదవ్, కుటుంబం బిక్కుబిక్కుమంటూ గడిపారు.
తమ పార్టీ నాయకుడు ఇంటిపై జరిగిన దాడిని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర తీవ్రంగా ఖండించారు. బహిరంగసభ నిర్వహించాలనుకొంటేనే ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు చేయిస్తారా?వైసీపీ నానాటికీ దిగజారిపోయి చివరికి ప్రతిపక్షాలపై భౌతికదాడులు కూడా చేయిస్తోందని ఆరోపించారు. వైసీపీ గూండాలు ఇంతగా రెచ్చిపోతుంటే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా?ఉంటే ఎందుకు పనిచేయడం లేదని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…