త్వరలో “ఓదార్పు యాత్ర – యంగ్ లీడర్స్”

odarpu yatra movie coming soonవైయస్ జగన్ పుణ్యమా అంటూ రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అవసరం లేని పదం “ఓదార్పు యాత్ర.” 2010లో ప్రారంభమైన ‘ఓదార్పు యాత్ర’ను మొన్నటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో ప్రజల్లోకి బాగా బలంగా వెళ్ళిన ఈ పదాన్ని ఓ సినిమా టైటిల్ గా వినియోగించుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

నలుగురు క్రిమినల్స్, పోలీసులతో కూడిన “ఓదార్పు యాత్ర – యంగ్ లీడర్స్” సినిమా పోస్టర్ పై బిజినెస్ వివరాల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లను ప్రచురించారు. మరి ఈ సినిమా జగన్ ఓదార్పు యాత్రకు సంబంధించి ఉంటుందో లేక ఇతర కథాంశం తీసుకున్నారో గానీ, ప్రస్తుతం హల్చల్ చేస్తున్న పోస్టర్ కు, టైటిల్ కు సంబంధం లేనట్లుగా కనపడుతోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories