News Beat

’’చోర్ బజార్’’ చిత్రంతో తెలుగులో నటిస్తున్న అర్చన

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్
చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” సినిమా నుంచి ఒక్కొక్కటిగా హైలైట్స్ రివీల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో నిన్నటితరం ప్రముఖ నాయిక, జాతీయ ఉత్తమ నటి అర్చన కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం తెలిపారు.

ఇంగ్లీష్, బెంగాళీ సహా అన్ని ప్రధాన భారతీయ భాషా చిత్రాల్లో దశాబ్దాల కెరీర్ సాగించింది అర్చన. వీడు చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం దక్కించుకుంది. తెలుగులో ఆమె నటించిన నిరీక్షణ, భారత్ బంద్, లేడీస్ టైలర్ లాంటి చిత్రాలను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు. చోర్ బజార్ చిత్రంతో 25 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపైకి వస్తోంది అర్చన. ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని మూవీ టీమ్ చెబుతోంది.

ADVERTISEMENT

“చోర్ బజార్” సినిమా త్వరలో థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

సాంకేతిక నిపుణులు –

సినిమాటోగ్రఫీ – జగదీష్ చీకటి
సంగీతం – సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్ – అన్వర్ అలీ,ప్రభు దేవా
ఆర్ట్ – గాంధీ నడికుడికర్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం
సౌండ్ డిజైనర్ : సాయి మనీందర్ రెడ్డి
ఆడియో – లహరి
కాస్ట్యూమ్స్ డిజైనర్ – ప్రసన్న దంతులూరి
ఫైట్స్ – ఫృథ్వీ శేఖర్
కొరియోగ్రఫీ – భాను
పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను
స్టిల్స్ – వికాస్ సీగు
పి.ఆర్.వో – జీఎస్కే మీడియా
మేకప్ – శివ
కాస్ట్యూమ్ చీఫ్ – లోకేష్
డిజిటల్ మీడియా – వాల్స్ అండ్ ట్రెండ్స్
సహ నిర్మాత – అల్లూరి సురేష్ వర్మ
బ్యానర్ – ఐ.వి ప్రొడక్షన్స్
నిర్మాత – వీ.ఎస్ రాజు
రచన దర్శకత్వం – బి. జీవన్ రెడ్డి.

Share
Vishnu Aadi

Vishnu is the Head of Daily Operations at M9 News, where he coordinates the writing team, publishers, and management. With a strong focus on ensuring smooth workflow and seamless collaboration, Vishnu plays a key role…

Published by

Recent Posts

వచ్చే ఎన్నికల పరిస్థితి ఏమిటి?

వచ్చే ఎన్నికల పరిస్థితి ఏమిటి? కేంద్రంలో మళ్ళీ మోడీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందా? లేక ఈసారి కాంగ్రెస్‌ కూటమిని…

32 minutes ago

I’ll Watch Sigma in Theatres – SS Rajamouli

Sigma starring Sandeep Kishan and Faria Abdullah is directed by Jason Sanjay, son of TN…

3 hours ago