Telugu

కాక్రోచ్లు రాజకీయ చట్రంలో చిక్కుకుంటున్నాయా.?

కాక్రోచ్ల పార్టీ ప్రతి ఉద్యమానికి జెన్ జీ ల మద్దతు లభిస్తుందా.? నీట్ ఉద్యమంతో, కేంద్ర విద్యశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా డిమాండ్ తో దేశంలోని యువత దృష్టిని ఆకర్షించగలిగిన సీజేపీ నేడు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ తో మరో ఉద్యమం చేపట్టింది.

అయితే నాడు ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా సాగిన సీజేపీ విజయం అనుకున్న స్థాయి కంటే ఎక్కువ ఫలితాలనే సాధించిందని చెప్పాలి. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలు, ఉద్యమం వెనుక సాగిన కొన్ని రాజకీయ వాస్తవాలు అదే యువతను ఆలోచనలో కూడా పడేశాయి.

ADVERTISEMENT

సీజేపీ లేవనెత్తుతున్న సమస్యలు, సాగిస్తున్న ఉద్యమాలు కేవలం బీజేపీ టార్గెట్ గానే సాగుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మాత్రం సీజేపీ సభ్యులకు ఎటువంటి సమస్యలు కనిపించడం లేదా అని, సీజేపీ చేపట్టే కార్యక్రమాల వెనుక ఎదో బలమైన రాజకీయ శక్తి పనిచేస్తుందని…ఇలా అనేకానేక ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి.

ఇక అందుకు తగ్గట్టే సీజేపీ సైతం కేవలం బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల కేంద్రంగానే తన రాజకీయాన్ని సాగిస్తూ ముందుకెళుతోంది. మొన్న దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా ఉద్యమించిన సీజేపీ నేడు దేశ వాణిజ్య రాజధాని ముంబై ని వేదిక గా ఎంచుకుంది.

ఈ రెండు రాష్ట్రాలలోను బీజేపీ ప్రభుత్వమే నడుస్తుంది. దీనితో నాటి సీజేపీ పై వచ్చిన ఆరోపణలు నేడు వాస్తవ రూపంలో దర్శనమిస్తున్నాయి అంటూ బీజేపీ మద్దతుదారులు సీజేపీ కి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అంటూ భారతదేశ రాజకీయంలోకి సోషల్ మీడియా వేదికగా తొలి అడుగు వేసిన కాక్రోచ్ జనతా పార్టీ నీట్ ఉద్యమం రూపంలో రాజకీయ పద్మవ్యూహంలోకి అడుగుపెట్టింది.

అయితే తన లక్ష్యం రాజకీయం కాదని, తనకు ఏవిధమైన రాజకీయ పార్టీలతో సంబంధాలు లేవని పేర్కొన్న సీజేపీ ఇప్పటికి అదే ప్రకటనకు కట్టుబడి ఉందా అంటే స్పష్టత కోసం మరికొన్ని రోజులు వేచి చూడాలి అనే సమాధానమే వినిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే సీజేపీ వేస్తున్న అడుగులన్ని కూడా రాజకీయ వైపే చూపిస్తున్నాయి.

సీఈసీ జ్ఞానేశ కుమార్ రాజీనామా డిమాండ్ తో సీజేపీ చీఫ్ అభిజిత్ చేస్తున్న ప్రకటనలు గమనిస్తే కాక్రోచ్లు కూడా దేశీయ రాజకీయ చట్రంలో చిక్కుకుపోయాయా అన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే ముంబై వేదికగా సీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు వ్యతిరేకంగా జెన్ నెక్స్ట్ ముంబై పేరిట నిరసనకారులు ధర్నా చేపట్టారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Akshara Haasan Failed Three Times, But Never Gave Up On Cinema

Akshara Haasan has spoken about an unexpected chapter from her school days. She revealed that…

37 minutes ago

Ranabaali: One Big Lesson to Learn from The Paradise

The Paradise may have ended up disappointing many viewers, but there is one thing the…

2 hours ago