
ప్రత్యేక హోదాతో గ్రాంట్లు ఎక్కువగా వస్తాయని, పరిశ్రమలకు వంద శాతం రాయితీ రావాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యం…
అధికారంలోకి వస్తే మద్యం షాపులనేవి లేకుండా చేస్తాం…
ఉద్యోగాలు ఎలా కత్తిరించాలా? అని ఏపీ సర్కార్ దిక్కుమాలిన ఆలోచనలు…
నేడు కాకినాడలో వైఎస్సార్సీపీ నిర్వహించిన యువభేరీ కార్యక్రమంలో వైయస్ జగన్ చేసిన కీలక వ్యాఖ్యలివి. ఆరోగ్య మిత్ర ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించారని, ఏపీపీఎస్సీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు, ప్రభుత్వం వచ్చి 20 నెలలు దాటినా నోటిఫికేషన్ ఇవ్వలేదని, పీహెచ్ డీలు చేసిన వారు కూడా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని ఏపీ సర్కార్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు.
పరిశ్రమల కోసం చంద్రబాబు సింగపూర్, మలేషియా, దావోస్ వెళ్లాల్సిన అవసరం లేదని, ఢిల్లీ వెళ్లి ప్రధానిపై ఒత్తిడి తెస్తే సరిపోతుందని, ‘ప్రత్యేక హోదా’తో ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని ఉద్యోగాలు, పరిశ్రమలు అన్నీ హైదరాబాద్ కే పరిమితమయ్యాయని, పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని హామీ ఇచ్చారన్నారు. ఇక్కడివరకు చేసిన రాజకీయ పరమైన విమర్శలకు తోడు వ్యక్తిగత దూషణలకు కూడా జగన్ దిగి, ఆయన దిగజారుడుతనాన్ని మరోసారి బయట పెట్టుకున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
‘చంద్రబాబు చర్మం మందమైంది. సమస్యలపై స్పందించడం లేదు. చంద్రబాబును చూస్తుంటే ‘మనిషికో మాట గొడ్డుకో దెబ్బ’ అనే సామెత నాకు గుర్తుకు వస్తోందని, ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే అసహ్యం వేస్తోందని, ఉన్న ఉద్యోగాలనే చంద్రబాబు తీసేస్తున్నాడు. ఇంకా కొత్త ఉద్యోగాలెక్కడి నుంచి ఇస్తాడు?’ అంటూ ఒక ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంభోదిస్తూ విధ్యార్ధులను ఉద్వేగపరిచే ప్రయత్నం చేసారు జగన్.
నిజానికి జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పటివి కావు. గతంలో యువభేరీలో పాల్గొన్న రెండు సందర్భాలలోనూ జగన్ ఈ రకమైన వ్యాఖ్యలే చేసారు. మీడియా సాధనాల్లో విద్యార్ధులు కూడా వినివిని ఒకింత విసుగు చెంది ఉన్నారు. అయితే ‘తానూ పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు’ అన్న చందంగా జగన్ అనుసరిస్తున్న వ్యవహార తీరుతో, తలలు పట్టుకోవడం సదరు పార్టీ నేతల వంతవుతోంది.
Naga Chaitanya's Vrushakarma has reached a point where the silence itself is becoming a problem.…
నందమూరి బాలకృష్ణ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగుతున్నారు. హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్…