
ABV's Vijayawada Mayor Bid Raises Debate
మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో నేడు విజయవాడ మేయర్ పదవికి నామినేషన్ వేయబోతున్నట్లు ప్రకటించారు. ఇది యాదృచ్ఛికంగా కనిపిస్తున్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయ సమీకరణాలలో మార్పుకు ఇది తొలి సంకేతంగా భావించవచ్చు.
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ కోలుకోలేదని 2024 ఎన్నికలలో మరోసారి నిరూపితమైంది. కనుక ఏపీలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవాలంటే ఏదో విధంగా వైసీపీని కలుపుకోక తప్పదు.
బహుశా ఆ ప్రయత్నంలోనే కొన్ని రోజుల క్రితం వామపక్ష నేతలు జగన్ నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ఈ నెల 26న విజయవాడలో నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడానికని వారు చెప్పుకున్నారు. ఎవరైనా అలాగే చెప్పుకుంటారు కూడా.
కానీ ఇండియా కూటమితో చేతులు కలపాల్సిందిగా కోరేందుకే అయ్యుండవచ్చు. అయితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో ఇబ్బంది పడుతున్న జగన్, వారికి తన షరతులు తెలియజేసి ఉండవచ్చు. దానికి కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి సానుకూల సంకేతం వచ్చి ఉండవచ్చు. కనుకనే ఆయన సీపీఐ ఆందోళనలకు సంఘీభావం తెలుపుతూ ట్వీట్స్ వేశారని భావించవచ్చు.
ఏబీ వెంకటేశ్వరరావు హఠాత్తుగా విజయవాడ మేయర్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తుండటం అందరినీ ఆశ్చర్యపరిచి ఉండవచ్చు. కానీ జగన్తో వామపక్షాల సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకొని ఉండవచ్చు.
బహుశా అందుకే రాయన భాగ్యలక్ష్మి వంటి బలహీనమైన అభ్యర్థిని వైసీపీ ప్రకటించింది. వంగవీటితో ఉన్న అనుబంధం లేదా భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని జగన్ డమ్మీ అభ్యర్థిని బరిలో నిలిపారంటూ సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడ్డారు. కానీ వంగవీటి కోసం కాదు… ఏబీ వెంకటేశ్వరరావు కోసమేనని ఇప్పుడు కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీజేపీను ముందుపెట్టి మోడీ ప్రభుత్వంతో కాంగ్రెస్ పోరాడుతున్నట్లే, ఇక్కడ ఏబీవిని ముందు పెట్టి కూటమి ప్రభుత్వంతో వైసీపీ పోరాదబోతోందా?త్వరలో తేటతెల్లమవుతుంది.
ఈ రోజు ఉదయం వామ పక్షాల నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది – విజయవాడ మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటే బలపరుస్తామని.
నాకు అభ్యంతరం లేదని చెప్పాను.
వారి వారి పార్టీల్లో అంతర్గతంగా చర్చించుకుని, సాయంత్రం 8 గంటలకి CPM, CPI, కాంగ్రెస్ పార్టీలనుంచి అంగీకారం వచ్చింది.
రేపు, అంటే 18-10-2026 న మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్ వేస్తాను.
12.30 కల్లా వినాయకుని గుడి దగ్గరకు సమర్థకులు అందరినీ చేరుకోమని విజ్ఞప్తి.
నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి, విజయవాడ మేయర్ గా ఎన్నుకొమ్మని విజయవాడ పట్టణ ఓటర్లందరికీ విన్నపం.
ఈ నామినేషన్ పనయ్యాక మరింత వివరంగా…
— ABV (@abvrao) October 17, 2026
Retired IPS officer AB Venkateswara Rao is set to contest the Vijayawada Municipal Corporation mayoral…
Nani and Vijay Deverakonda are moving away from the romantic entertainers and emotional dramas that…