
ఇండస్ట్రీ వర్గాలలో హల్చల్ చేస్తోన్న సమాచారం ప్రకారం అయితే, బొమ్మ ‘బ్లాక్ బస్టర్’ అయ్యే సంకేతాలు కనపడుతున్నాయి గానీ, అంతిమంగా తేల్చాల్సింది ప్రేక్షకులే గనుక, ఆడియన్స్ టాక్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాలలో ధియేటర్ల వద్ద అభిమానుల హంగామా మొదలయ్యింది. ఫ్లెక్సీలు, బ్యానర్లతో ధియేటర్లను నింపేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.
అందులో భాగంగా ఏపీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు పవన్ కళ్యాణ్ లు పక్కపక్కన పెడుతూ బ్యానర్ వెలిసాయి. ఇద్దరూ కూర్చుని ఉన్న ఈ బ్యానర్ పిక్ సోషల్ మీడియాకు ఎక్కడం, అది అభిమానుల నడుమ వైరల్ కావడం జరిగిపోయింది. ఈ ఫ్లెక్సీ చూసిన అభిమానులు సోషల్ మీడియాలో అయితే తమ హీరో ఫ్యాన్స్ తీరు పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఓ పక్కన ‘భీమ్లా నాయక్’ సినిమాను నిలువరించే విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగన్ సర్కార్ చర్యలు చేపడుతుంటే, మరో వైపున జగన్ తో కూడిన ఇలాంటి బ్యానర్లు వెలియడంతో ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. టికెట్ ధరలను లైట్ గా తీసుకున్నా, కనీసం బెనిఫిట్ షోలు లేకుండా చేయడంపై పవన్ ఫ్యాన్స్ మిక్కిలి ఆగ్రహాంతో రగిలిపోతున్నారు.
ఈ సమయంలో జగన్ – పవన్ ల ఇద్దరి అభిమానులు పెట్టిన ఈ బ్యానర్ చించేయండి అంటూ ఇతర ఫ్యాన్స్ కు పిలుపునిస్తున్నారు. గత ఎన్నికల సందర్భంలో కూడా ‘పవన్ అంటే ప్రాణమిస్తాం, జగనన్నకు ఓటు వేస్తాం’ అంటూ మ్యూచువల్ ఫ్యాన్స్ నినాదాలు చేసారు. ప్రస్తుతం తమ అభిమాన హీరో సినిమాను జగన్ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా, ఈ మ్యూచువల్ ఫ్యాన్స్ పట్టించుకోకపోవడం ఊహించని పరిణామం.
Royal Challengers Bengaluru defeated Mumbai Indians by 2 wickets in a thrilling last-ball match in…
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…