
తెలుగు హీరోలలో ప్రిన్స్ మహేష్ బాబుకు తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం, గత ఆదివారం నాడు బుల్లితెరపై ప్రసారం అయిన ఈ సినిమా నిరూపించింది. ఏదో ప్రసారం అయ్యింది కదా అంటే అయ్యిందని కాదు, డబ్బింగ్ చిత్రాల టీఆర్పీ రేటింగ్స్ రికార్డును బద్దలుకొట్టింది ఈ “1 నేనొక్కడినే.” ఇప్పటివరకు తమిళ బుల్లితెరపై ‘బాహుబలి 1, ఈగ, మగధీర’ సినిమాలే వరుసగా మూడు స్థానాలలో నిలిచాయి. ఈ మూడు కూడా రాజమౌళి నుండి వచ్చినవి కావడం విశేషం.
ఈ జక్కన్న చిత్రాలను అధిగమించి, కోలీవుడ్ ట్రేడ్ వర్గాలకు సుక్కూ – ప్రిన్స్ కాంబో షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఊహించని ఈ ఆదరణతో కోలీవుడ్ లో మహేష్ అన్న నామధేయం మరో సారి హాట్ హాట్ గా హల్చల్ చేస్తోంది. కొత్తదనంతో కూడిన కధలను ఆదరించడంలో తెలుగు కంటే తమిళ ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని ఈ సందర్భంగా మరోసారి నిరూపణ అయ్యింది. అలాగే “స్పైడర్” ద్వారా త్వరలో తమిళ ప్రేక్షకులకు చేరువ కావాలనుకుంటున్న మహేష్ ఫ్యాన్ రేంజ్ ను కూడా ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు చూపించినట్లయ్యింది.
Aadarsha Kutumbam House No. 47 had a strong weekend on paper, with the makers announcing…
ఏపీలో జరిగిన స్థానిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నేడు మొదలయ్యింది. అయితే ఇందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…