
సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ‘డిజాస్టర్’గా మిగిలినప్పటికీ, కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల మదిలో మాత్రం ‘డైమండ్’గా ఉండడంతో, దానిని పురస్కరించుకుని మహేష్ అభిమానుల హంగామా మొదలైంది. ‘పాత్ బ్రేకింగ్ మూవీ’గా కొనియాడిన ఈ సినిమా, అప్పట్లో యుఎస్ మంచు తుఫాన్ ను తట్టుకుని మరీ 1 మిలియన్ డాలర్స్ క్లబ్ లో నిలవడం విశేషంగా చెప్పుకోబడింది. ఈ మంచు తుఫాన్ కు భయపడి హాలీవుడ్ సినిమాల రిలీజ్ లను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.
సరిగ్గా ఇదే రోజున ప్రస్తుతం పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” కూడా విడుదల కాగా, ఈ రెండు సినిమాలకు ఓ సారుప్యత కూడా ఉంది. డిసెంబర్ 19వ తేదీన ఈ రెండు సినిమాలు ఆడియోలు రిలీజ్ చేసుకోగా, జనవరి 10వ తేదీన ధియేటర్లలో ప్రత్యక్షమయ్యాయి. అయితే మహేష్ సినిమా ఏమో కెరీర్ లో ఓ కలికితురాయిగా మిగిలిపోగా, పవన్ కళ్యాణ్ సినిమాకు వస్తున్న ప్రాధమిక రిపోర్ట్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. అయితే యుఎస్ లో మాత్రం ‘బాహుబలి’ ప్రీమియర్స్ రికార్డును దాటి టాప్ 2లో నిలవడం చెప్పుకోదగ్గ విషయం.
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల…
Recently, the trailer of Karthi's most anticipated sequel Sardar 2 directed by PS Mithran, was…