
ఈ దందా కోసం దళారులు ఏకంగా ఓ వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. కరెన్సీ చెస్ట్ ల వద్ద కమీషన్ ఆధారంగా నోట్ల మార్పిడి ప్రక్రియ వేగంగా, గుట్టుగా సాగుతోంది. 20 నుండి 30 శాతం కమిషన్‌పై దళారులు ఎంత సొమ్మునైనా చిటికెలో మార్చి ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషన్‌పై కొత్త నోట్లు ఇచ్చేసిన తర్వాత అధికారులు అందుకు అనుగుణంగా రికార్డులు తయారు చేస్తున్నారని గుంటూరు జిల్లాలో వ్యక్తమవుతున్న ఆరోపణలు.
గుంటూరు నగరంలోని లాలాపేటలో ఓ ప్రైవేటు బ్యాంకులో అచ్చంగా ఇదే వ్యాపారం జోరుగా సాగుతోందని స్థానికంగా హల్చల్ చేస్తున్న టాక్. అమరావతి ప్రాంతంలోని ఓ విత్తన వ్యాపారి ఈ కమిషన్ పద్ధతిని ఉపయోగించుకుని కోటి రూపాయలు మార్చుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నోట్ల మార్పిడి కోసం సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే… ఇలా దొడ్డిదారిన నోట్ల మార్పిడి దందా ఏంటంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు బ్యాంకులపై నిఘా వేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Reports about Prabhas reuniting with Darling director Karunakaran may turn out to be false. Initial…
A shocking incident at a government school in Raptadu has triggered widespread outrage. A Class…