Telugu

14 ఏళ్ళ రికార్డు – 15 ఏళ్ళ పిల్లాడి చేతిలో

ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో ఫియర్లెస్ బ్యాటింగ్ శైలి తో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులను సాధించి ఐపీఎల్ నాకౌట్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు ఈ 15 ఏళ్ళ చిచ్చరపిడుగు ‘వైభవ్ సూర్యవంశీ’.

ఈ 2026 ఐపీఎల్ సీజన్ మొదటి నుండే అపోజిషన్లను వణికిస్తున్న వైభవ్, నిన్న జరిగిన ఎలిమినేటర్ లో మ్యాచ్ ను మొదటి 8 ఓవర్లలోపే వన్-సైడ్ చేసేశాడని చెప్పవచ్చు. కేవలం 29 బంతులు ఎదురుకున్న వైభవ్ 5 ఫోర్లు, 12 సిక్సర్లతో హైదరాబాద్ జట్టు విజయానికి మధ్య గోడ లా నిలిచాడు.

ADVERTISEMENT

ఈ సీజన్లో ఏకంగా 680 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు. ఈ 680 పరుగులలో ఏకంగా 610 పరుగులు బౌండరీల రూపంలోనే స్కోరు చెయ్యటం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. క్రికెట్ లో మహా-మహులు సైతం వైభవ్ ఆటతీరు కు, కాన్ఫిడెన్స్ కు ముగ్ధులవ్వక తప్పడం లేదు.

కెవిన్ పీటర్సన్, ఏ.బీ.డి విలియర్స్, క్రిస్ గేల్ వంటి బడా బడా క్రికెట్ లెజెండ్స్ కూడా వైభవ్ సూర్యవంశీ ఆటను చూసి ఆకర్షితులవ్వక తప్పలేదు అని తమ తమ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ప్రస్తుతం, క్రికెట్ ప్రపంచమంతా వింటున్న పేరు గా ‘వైభవ్ సూర్యవంశీ’ మారిపోయింది.

తన క్రికెటింగ్ కెరీర్లో ఎప్పటికైనా ఒక టి-20 మ్యాచ్లో 200 కొట్టాలి, అదే ప్రస్తుతానికి తన బిగ్గెస్ట్ గోల్ అంటూ వైభవ్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఐపీఎల్ లో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా క్రిస్ గేల్ పేరిట ఉన్న ఆ 14 ఏళ్ళ రికార్డును ఈ 15 ఏళ్ళ వైభవ్ కేవలం తన 2వ ఐపీఎల్ సీజన్ తో నే తన పేరిట లిఖించుకున్నాడు.

ఇలా, ఇంతటి చిన్న వయసులో క్రికెట్ లోకి అరంగేట్రం చేయటమే గగనం అనుకుంటే, ప్రస్తుతం వైభవ్ చూపిస్తున్న టెక్నీక్, ఆటతీరు, షాట్ సెలెక్షన్, బ్యాటింగ్ అప్రోచ్ చూస్తే సగటు క్రికెట్ అభిమానులకు ఇతడి వయసు కు ఆటకు అస్సలు సంబంధమే లేదు అనే మాట రాకతప్పదు. మరి మునుముందు ఇతడి కెరీర్లో ఇంకెంతమంది రికార్డులను చెల్లాచెదురు అవుతాయో.? ఇంకెన్ని రికార్డులను తన పేరిట లిఖించుకుంటాడో అని చూడాలి..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers

There were decent expectations for Epic. At the very least, audiences expected a passable one-time…

38 minutes ago

Haiwaan Public Talk: Akshay Kumar’s Film Dead on Arrival?

Haiwaan arrived in theatres after a long wait. Expectations were sky-high for a lot of…

53 minutes ago