Telugu

ఎక్కడ పట్టుకుంటే అక్కడ చిరిగిపోతున్న 2000 నోటు!

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు ఎప్పుడూ అనుభ‌వించ‌ని కొత్త కొత్త క‌ష్టాలు అనుభ‌విస్తున్నారు. త‌మ‌ బ్యాంకు ఖాతాలో డ‌బ్బున్న‌ప్ప‌టికీ తీసుకోలేని ప‌రిస్థితి, బ్యాంకుల ముందుకు చేరుకుంటే బ్యాంకు సిబ్బందితో పాటు క్యూలో నిల‌బ‌డిన వారితో గొడ‌వ‌లు, పోలీసుల లాఠీఛార్జీలు వంటి ఘ‌ట‌న‌లు నెల‌కొంటూనే ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో చిన్న నోట్లే కాదు కొత్త‌గా తీసుకొచ్చిన 2000 నోటు కూడా పొంద‌డం క‌ష్టంగా మారింది. అన్ని క‌ష్టాలు ఎదుర్కొని చివ‌రికి ఏడు కొండ‌ల వాడిని చూసినట్లు ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొని బ్యాంకు నుంచి ప్ర‌జ‌లు డ‌బ్బు అందుకుంటున్నారు.

ADVERTISEMENT

అయితే కేర‌ళ‌లో డ‌బ్బు అందుకున్న ఓ మ‌హిళ‌కు డ‌బ్బు అందుకున్న త‌రువాత కూడా వింత క‌ష్టాలు ఎదుర‌య్యాయి. బ్యాంకు నుంచి డ్రా చేసిన రెండు వేల కరెన్సీ నోట్లను పొందిన స‌ద‌రు మ‌హిళ‌ ఓ నోటు డ్రా చేసిన కొద్ది సమయానికే ముట్టుకుంటే చిరిగిపోవడం ప్రారంభించింది. తాళిపరంబ టౌన్‌ లోని ఫెడరల్‌ బ్యాంకు బ్రాంచ్‌ నుంచి రెండు వేల నోట్లు తీసుకున్న‌ పీసీ షరీఫా అనే మహిళకు ఈ అనుభ‌వం ఎదుర‌యింది. తీసుకున్న నోట్ల‌లోని సీరియల్‌ నంబర్‌ 456828 ఉన్న రెండు వేల నోటు ముట్టుకుంటేనే చివర్లలో చిరిగిపోవడం ప్రారంభించింది.

ఈ విష‌యంపై స‌ద‌రు మ‌హిళ‌ కుమారుడు షిమీల్ మీడియాకు తెలుపుతూ ఒక‌ నోటు చినిగిపోగా మిగిలిన నాలుగు నోట్లు కూడా అలాగే చిరిగిపోతుండటం గమనించి వాటిని వెంట‌నే ఖర్చులకు వాడేశానని చెప్పాడు. త‌న వ‌ద్ద ఉన్న‌ బాగా చిరిగిన నోటును ఎవరూ తీసుకోవడం లేదని ఆ నోటును మీడియాకు చూపించాడు. చివ‌ర‌కు ఈ నోటుని తీసుకొని బ్యాంకు వెళ్లి తిరిగి ఇచ్చేస్తానంటే బ్యాంకు వారు కూడా నోటును తీసుకోలేద‌ని తెలిపాడు. ఈ విష‌యంపై బ్యాంకు అధికారులను అడిగినా స్పందించలేదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఇంటింటికీ తెలుగుదేశం… కోటి ధన్యవాదాలు!

కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…

53 minutes ago

Jagan Locked Period, But Who Will Back Him?

The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…

1 hour ago