Telugu

ఇంటింటికీ తెలుగుదేశం… కోటి ధన్యవాదాలు!

కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు కూడా అమలు చేస్తోంది. అయినప్పటికీ వైసీపీ దుష్ప్రచారం ముందు ఇవన్నీ దిగదుడుపే అన్నట్లుంది.

ADVERTISEMENT

ప్రభుత్వం చేస్తున్న ప్రతీ మంచి పనిలో తప్పులు వెతుకుతూ, చేతిలో ఉన్న మీడియాతో దుష్ప్రచారం చేస్తూనే ఉంది. ఐదేళ్ళలో ఒక్క డీఎస్సీ కూడా తీయలేకపోయిన వైసీపీ, కూటమి ప్రభుత్వం డీఎస్సీ తీసి సుమారు 16 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే ఏవిధంగా దుష్ప్రచారం చేస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఉపాధ్యాయులే ఖండిస్తున్నా వైసీపీ దుష్ప్రచారం ఆపట్లేదు.

రాష్ట్రంలో ఇలాంటి ప్రతిపక్షం ఉన్నందున కూటమి ప్రభుత్వం దానిని రాజకీయంగా ఎదుర్కొంటూనే, మరో పక్క చేసిన ప్రతీ పని గురించి ప్రజలకు చెప్పుకోవడం తప్పనిసరిగా మారింది.

సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు టీడీపి శ్రేణులు “ఇంటింటికీ తెలుగుదేశం-2026” కార్యక్రమం చేపట్టారు. తమ ప్రభుత్వం ఈ రెండేళ్ళ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.

గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పధకాలు తప్ప మరేమీ చేయకపోయినా, జగన్మోహన్ రెడ్డి తన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలని ‘గడప గడపకు’ వెళ్ళి వాటి గురించి చెప్పమని ఒత్తిడి చేసేవారు. మంత్రుల చేతికి తన బొమ్మలున్న స్టిక్కర్లు ఇచ్చి ప్రతీ ఇంటిపై అంటించాలని ఒత్తిడి చేసేవారు. విధిలేక రోజా వంటివారు అందుకు సిద్దపడినా పలువురు మంత్రులు, ఎమ్మెల్యే ప్రజల ఛీత్కారాలకు భయపడి ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా తప్పించుకునేవారు.

కానీ సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలు జోడు గుర్రాల్లా పరుగులు తీయిస్తున్నారు. కనుక ఆయన ఆదేశం మేరకు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా “ఇంటింటికీ తెలుగుదేశం-2026” కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇప్పటి వరకు కోటికి పైగా ఇళ్ళను సందర్శించి, ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాల గురించి వివరించారు. పనిలో పనిగా ఆయా కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు, స్థానిక సమస్యలు, అవసరాల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న పథకాలపై కూడా ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకుని, ఆ వివరాలను తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని మంత్రి నారా లోకేష్‌ ట్వీట్‌ చేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jagan Locked Period, But Who Will Back Him?

The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…

38 minutes ago

కేసీఆర్‌కి చెప్తే వినలేదు… మీరైనా వింటారా రేవంత్?

తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్…

1 hour ago