
‘ధృవ’ సినిమా విడుదల డిసెంబర్ 9వ తేదీ గనుక, ఈ ఏడాదిలో బుల్లితెరపై అధికారికంగా ప్రదర్శితం సాధ్యం కాదు గనుక, 2016 సంవత్సరానికి గానూ అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ ను సాధించిన చిత్రంగా “జనతా గ్యారేజ్” నిలిచింది. 20.69 రేటింగ్స్ తో ‘బాహుబలి, శ్రీమంతుడు’ తర్వాత స్థానాన్ని ‘జనతా గ్యారేజ్’ దక్కించుకోగా, ఈ ఏడాదికి గానూ రెండవ స్థానంలో సంచలనమైన “బిచ్చగాడు” సినిమా 18.75 రేటింగ్స్ తో సత్తా చాటాడు. వెండితెరపైనే కాదు, బుల్లితెర మీద కూడా తన సత్తాను చాటడంలో “బిచ్చగాడు” నూటికి నూరు శాతం విజయవంతం అయ్యాడు.
ఆ తర్వాత స్థానాల్లో సర్ధార్ గబ్బర్ సింగ్ – 15.24, సుప్రీం – 14.79, సోగ్గాడే చిన్నినాయన – 14.20, ఈడో రకం ఆడో రకం – 13.74, నేను శైలజ – 12.37, అ…ఆ… – 12.36, నాన్నకు ప్రేమతో – 12.23, ఊపిరి – 11.17 రేటింగ్స్ తో టాప్ 10 స్థానాలను దక్కించుకున్నాయి. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయం చవిచూసిన “బ్రహ్మోత్సవం” బుల్లితెర మీద కూడా అదే స్థాయిలో ప్రదర్శితమై, చిత్ర యూనిట్ ను, అభిమానులను తీవ్రంగా నిరుత్సాహపరిచింది.
చిత్రం: రంభ ఊర్వశి మేనక M9 రేటింగ్: 1.5/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 04, 2026 తారాగణం: అల్లరి నరేష్,…
Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…