Telugu

2017లో వైసీపీ ట్వీట్… 2022లో ట్రోలింగ్..!

“కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేస్తూ చంద్రబాబు చార్టెడ్ ఫ్లైట్ లో తిరగడం ఎంతవరకు సమంజసం” అంటూ 2017 అక్టోబర్ 21వ తేదీన వైసీపీ నేత బొత్స చేసిన ప్రశ్నిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

కట్ చేస్తే… 2022 జనవరి 12వ తేదీ… 20 నిముషాల సీఎం రహదారి ప్రయాణానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హెలికాఫ్టర్ లో ప్రయాణించారు, అది కూడా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నపుడు!

ADVERTISEMENT

కాలం ఏది ఉంచుకోదు… కాస్త సమయం అటు ఇటు కావచ్చు గానీ, ఎవరికి ఇవ్వాల్సింది వారికి తిరిగి ఇచ్చేస్తుందని చెప్పడానికి ఓ ఉదాహరణగా ఈ ఉదంతం నిలిచిపోతోంది. సీఎం జగన్ చేసిన ప్రయాణాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు, నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

నాడు చంద్రబాబు, నేడు వైఎస్ జగన్… ఇద్దరు ముఖ్యమంత్రులు చేసిన ప్రయాణాలు, లక్ష్యాలలో కూడా చాలా వ్యత్యాసం ఉంది. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల విషయంలో, అలాగే పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు చేసిన ప్రయాణాలలో చార్టెడ్ ఫ్లైట్ ను వినియోగించారు.

నేడు జగన్ చేసిన ప్రయాణం ఏమిటంటే… నాడు చంద్రబాబు నాయుడు పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో చేసిన ప్రయత్నాలలో భాగంగా… చెన్నై, బెంగుళూరులలో ఏర్పాటు అయిన ఐటీసీ హోటల్స్ గ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

1.44 ఎకరాలలో సువిశాలంగా ఏర్పాటు చేసే విధంగా, అందులోనూ నాటి ప్రభుత్వం ప్రతిపాదించిన రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి 2016లో చంద్రబాబు నాయుడు చేత శంకుస్థాపన చేయబడిన హోటల్ ను ప్రస్తుత సీఎం జగన్ ప్రారంభించడానికి వెళ్లారు.

సీఎం నివాసం నుండి గుంటూరు ఐటీసీ హోటల్ కు రహదారి ద్వారా ప్రయాణించాలంటే దాదాపుగా 45 నిముషాలు ప్రయాణం చేయాల్సి ఉంది. అదే ఎలాంటి ట్రాఫిక్ లేకుండా సీఎం కాన్వాయ్ అయితే అందులో సగం సమయం మాత్రమే ఉంటుంది. మరి ఈ ప్రయాణానికి సీఎం చార్టెడ్ ఫ్లైట్ వినియోగించడమే ఈ ట్రోలింగ్ కు ప్రధాన కారణం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ram’s Extreme Step: Bold Reinvention or Self-Destruction?

After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…

2 hours ago

Pics: Simran Dhanwani Sizzles In Bold Red Saree Look

Simran Dhanwani is redefining the classic red saree with a bold, contemporary twist. Draped in…

3 hours ago