
ఇంతగా ఇందులో ఏముందంటే అయిదేళ్ల క్రితం కేరళను ముంచెత్తిన వరదల నేపథ్యంలో కట్టిపడేసే డ్రామాతో ఓ థ్రిల్లర్ ఇచ్చారు. స్వయంగా అనుభవించిన ట్రాజెడీ కావడంతో అక్కడి జనాలు ఎగబడి చూస్తున్నారు. ఇంకో వారంలోనే డబుల్ సెంచరీ చేరుకున్నా ఆశ్చర్యం లేదు. ఇంకోవైపు ది కేరళ స్టోరీ ఏకంగా 200 కోట్లను టార్గెట్ గా పెట్టుకుని పరుగులు పెడుతోంది. ఈ ఏడాది బాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో పఠాన్ తర్వాతి స్థానంలో నిలబడింది. తూ జూఠీ మై మక్కర్, భోళా లాంటి వాటిని క్రాస్ చేసి సత్తా చాటింది.
ఇలాంటి వండర్లు అన్ని భాషల్లోనూ జరుగుతున్నాయి. బలగం ఏం మేజిక్ చేసిందో చూశాంగా. మొన్నటికి మొన్న టీవీలో వేస్తే 14.5 టిఆర్పి వచ్చింది. భాగ్యనగరం మాత్రమే చూసుకుంటే 22 దాటేసింది. ఇది ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లాంటి ప్యాన్ ఇండియాలకే సాధ్యం కాని ఫీట్. మన దగ్గర ఎప్పుడో మార్కెట్ తగ్గిన ధనుష్ సార్ అని పలకరిస్తే తమిళం కన్నా పెద్ద హిట్టు మనమే ఇచ్చామ్. మల్లువుడ్ లో ఛాన్సుల కోసం పోరాడుతున్న సంయుక్త మీనన్ కు డిమాండ్ పెరిగిపోయింది. ఇదంతా సబ్జెక్టు దమ్ము ఉండటం వల్లే కదా.
ఆ మధ్య రైటర్ పద్మభూషణ్ సైతం ఇదే తరహాలో మంచి విజయం సాధించింది. ఇలాంటి లెక్కలేనన్ని ఉదాహరణలు గతంలోనూ ఉన్నాయి కానీ లాక్ డౌన్ తర్వాత ఆడియన్స్ దృక్పథం ఎంతగా మారిందని చెప్పడానికి ఇవి కొన్ని శాంపిల్స్ మాత్రమే. విషయం తేడా ఉంటే ఏం జరుగుతుందో భారీ సెటప్పుతో వచ్చిన ఏజెంట్, కస్టడీ, శాకుంతలం, అమిగోస్ వగైరాలు ఋజువు చేశాయి. కేవలం గ్రాండియర్లకే జనం టికెట్లు కొంటారనుకుంటే పొరపాటే. పదార్థాలు రుచిగా ఉంటే కారేసుకెళ్లి మరీ రోడ్డు పక్కన బండ్ల దగ్గర తినే సగటు భారతీయ మనస్తత్వం తమకు నచ్చేదేదో సినిమాలో ఉందంటే ఖచ్చితంగా థియేటర్లకు వెళ్తుంది. ఈ సత్యం గుర్తిస్తే చాలు
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…
SS Rajamouli is known for his large-scale filmmaking and carefully planned promotional campaigns. The director…