
2024 మే 13 పోలింగ్ రోజున జరిగిన సంఘటనలను పరిశీలిస్తే వైసీపీ పాలనలో రాష్ట్రం సాధించిన పురోగతి ఏంటో అందరికి తెలిసొచ్చింది. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్నింట్లో వెనుక పడిపోయింది, ఏ ఒక్క విషయంలోనూ పొరుగు రాష్ట్రాలతో పోటీ పడే స్థాయిలో ఏపీ లేదు అంటూ రాష్ట్రాన్ని తక్కువ చేసిన ప్రతిపక్ష పార్టీలకు ఏపీ ఎన్నింట్లో ముందువరుసలో ఉందో జస్ట్ శాంపిల్ చూపించారు వైసీపీ నేతలు.
ఏపీ దాడులలో, అల్లర్లలో, విధ్వంసంలో బీహార్ ను మించి పోయింది అనేలా ఏపీలో ఎన్నడూలేని భయానక వాతావరణాన్ని సృష్టించారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. అయితే పోలింగ్ పూర్తయిన తరువాత కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఇదే పరిస్థితి నెలకొనడంతో ఏపీ ఎటు పోతుంది అనే అయోమయ పరిస్థితికి వచ్చేసారు సామాన్య ప్రజానీకం. అయితే ఈ దాడులను కట్టడి చేయలేక పోయిన పలువురు పోలీస్ అధికారులను బాధ్యతులు గా చేస్తూ ఏసీ చర్యలకు పాల్పడింది.
గెలుపు పై ధీమాగా ఉన్న ఇరు పార్టీలు కూడా వారి వారి అంచనాలకు తగ్గితే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే పాలిట వెల్లడికి ఇంకా పద్నాలుగు రోజులు ఉండడంతో ఈవీఎం ల భద్రతా మీద కూడా అనుమానాలున్నాయి అంటున్నారు కూటమి నేతలు. అలాగే ఎన్నికల ఫలితాలు విడుదల రోజు కూడా రాష్ట్రంలో మరికొన్ని దాడులు జరిగే అవకాశం ఉందంటూ కేంద్ర నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందులో పవన్ పోటీ చేసిన పిఠాపురం, కాకినాడ ప్రాంతాలు కూడా చేరాయి.
కౌంటింగ్ కు రెండు మూడు రోజుల ముందునుంచి పిఠాపురం, కాకినాడ సిటీ లో ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావు పేట సహా పలు ప్రాంతాలలో అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ వాటి పై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని ఇంటిలిజెన్స్ వర్గాలు ఈసీ కి సూచించింది. నిఘా వర్గాల హెచ్చరికలతో ఎలర్ట్ అయినా పోలీసులు ఆయా ప్రాంతాలలో భద్రతా కట్టుదిట్టం చేసారు. అల్లర్లకు ప్రేపించేలా ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేసిన తక్షణమే వారి పై చర్యలు తీసుకునేలా అధికారులు అస్త్ర శాస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.
పోలింగ్ రోజు ఆ తరువాత రాష్ట్రంలో జరిగిన హింసను అరికట్టలేక పోయిన పోలీస్ బాస్ లకు ముందుగానే హెచ్చరికలు పంపింది ఈసీ. కౌంటింగ్ కు రెండు రోజుల ముందు నుంచే అందరూ అప్రమత్తంగా ఉంటూ ఇటువంటి దాడులు జరగకుండా నియంత్రించ వలసిన బాధ్యత మీ పైనే ఉందంటూ పోలీస్ ఉన్నతాధికారులకు సీరియస్ అల్టిమేటం జారీ చేసింది ఈసీ. ఈ నిఘా వర్గాల హెచ్చరికలు, ఉన్నతాధికారుల ఆదేశాలు, మీడియాలో ప్రచారమవుతున్న వార్తలతో జూన్ 4 న రాష్ట్రంలో ఎం జరగబోతుంది అంటూ భయంతో కొందరు, ఆత్రుత తో మరికొందరు కౌండ్ డౌన్ మొదలుపెట్టారు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…