2025: ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రానిదే!

కాల చక్రంలో మరో కొత్త సంవత్సరం మొదలైంది. 2024 అనేక సంచలనాలు నమోదు చేసుకొని వెళ్ళిపోయింది. కొత్త సంవత్సరం 2025లో కూడా అటువంటి సంచనాలుంటాయని ఎఫ్-1 రేసింగ్ కేసు, అల్లు అర్జున్‌ కేసు, ఇంకా ఏపీలో వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసులు సూచిస్తున్నాయి.

ఈ కేసులు, వివాదాలు, రాజకీయాలు అన్నీ పక్కనపెట్టి చూస్తే 2024 ఎన్నికల ఫలితాలతోనే ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు ప్రారంభం అయ్యాయని చెప్పవచ్చు. సిఎం చంద్రబాబు నాయుడు జోరు చూస్తుంటే 2025 ఇంకా అద్భుతంగా ఉండబోతోందని స్పష్టంగా తెలుస్తోంది.

ADVERTISEMENT

మార్చి నుంచి అమరావతి పునర్నిర్మాణ పనులు మొదలవబోతున్నాయి. కనుక డిసెంబర్‌ నాటికి అమరావతి రూపురేఖలలో స్పష్టమైన మార్పులు కనిపించనున్నాయి. రాష్ట్రంలో మళ్ళీ సానుకూల వాతావరణం నెలకొనడంతో పరిశ్రమలు, పెట్టుబడులు తరలివస్తున్నాయి. కనుక డిసెంబర్‌లోగా పారిశ్రామికాభివృద్ధి కూడా కనిపిస్తుంది.

విశాఖకు ఐటి కంపెనీలను రప్పించేందుకు సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ చాలా గట్టిగానే కృషి చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలిస్తే ఐటి రంగంలో మళ్ళీ భారీ ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయి.

పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలనే కూటమి ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. తద్వారా ప్రభుత్వం-ప్రైవేట్ భాగస్వామ్యంలో రాష్ట్రంలో పర్యాటక ఆకర్షణ కేంద్రాల అభివృద్ధి జరుగుతుంది. అప్పుడు పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది.

కూటమి ప్రభుత్వం వీటన్నిటినీ సమాంతరంగా చేపడుతోంది కనుక వీటి సమిష్టి ఫలితం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని, రాష్ట్రం రూపురేఖలను సమూలంగా మార్చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

జగన్‌ జమిలి కలలు కంటున్నప్పటికీ మరో నాలుగున్నరేళ్ళ వరకు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. కనుక అంతవరకు కూటమి ప్రభుత్వం వద్ద పుష్కలంగా సమయం ఉంది.

రాష్ట్రంలో సుస్థిరమైన బలమైన ప్రభుత్వం ఉంది. అలాగే కేంద్రంలో చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నారు. కనుక రాష్ట్రాభివృద్ధికి మోడీ ప్రభుత్వం అన్ని విదాల సహకరిస్తోంది కూడా. కనుక ఏవిదంగా చూసినా ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రానికి 2025 చాలా మంచి సంవత్సరంగా నిలువబోతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vijay Long-Delayed Film Release Date OUT: Big Comeback?

Finally, Vijay Sethupathi's long-pending project Train directed by Mysskin has got its release date. Recently,…

7 minutes ago

After Flops, KJo Ditches Romance for Mythology?

Karan Johar has recently started planning another big film. Latest updates have revealed that the…

22 minutes ago