Telugu

2025 కాంట్రవర్సి పొలిటిషన్స్.?

* కవిత…

రెండు తెలుగు రాష్ట్రాలలో 2025 లో మోస్ట్ కాంట్రవర్సి పొలిటీషియన్ ఎవరు అంటే కల్వకుంట కవిత అని చెప్పొచ్చు. తండ్రి పెట్టిన పార్టీ పై విమర్శలు చేస్తూ, ఆ పార్టీ నేతల పై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ, పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అంటూ బిఆర్ఎస్ ఉనికి మీదే నిందలు వేశారు. దాని ఫలితంగా కవిత బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటు ఎదుర్కొంటు పార్టీ సభ్యత్వానికి, పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిత్యం వార్తలలో నిలుస్తున్నారు.

ADVERTISEMENT

* కోమటిరెడ్డి బ్రదర్స్…

తెలంగాణ అధికార పార్టీలో ఉన్న ఈ కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి ఇద్దరు కూడా మోస్ట్ కాంట్రవర్సీ నేతలుగా 2025 క్యాలెండర్ లో తమ పేరు నమోదు చేసుకున్నారు. రేవంత్ సర్కార్ లో తనకు మంత్రి పదవి దక్కలేదని తమ్ముడు రాష్ట్ర అధినాయకత్వం పై విమర్శలు చేస్తూ పార్టీ అధిష్టానంతో చివాట్లు తిన్నారు.

ఇక సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న అన్న వెంకటరెడ్డి సైతం తానూ సినీ పరిశ్రమకు మంత్రిగా ఉన్నప్పటికీ సినీ పరిశ్రమ ముఖ్యమంత్రి రేవంత్ కి చేసే సత్కారంలో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఒకసారి, కోనసీమకు తెలంగాణ దిష్టి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు గాను తెలంగాణలో పవన్ సినిమాలు ఆడనివ్వం అంటూ మంత్రిగా వెంకటరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, సినిమా టికెట్ రేట్ల అంశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కాంట్రవర్సీ నేతగా ప్రకటించాయి.

* కొండా సురేఖ…

కొండా సురేఖ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా మంత్రిగా ఉన్న ఈమె మిగతావారితో పోలిస్తే కాంట్రవర్సీలలో ఒక ఆకు ఎక్కువే చదివారని చెప్పొచ్చు. గతంలో నటి సమంత విడాకుల అంశంలో అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు గాను నాగార్జున న్యాయస్థానంలో మంత్రి పై పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో తుది విచారణకు వచ్చిన ఈ కేసులో మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని అక్కినేని కుటుంబానికి క్షమాపణలు తెలిపారు.

అలాగే పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ తన శాఖలో ఫైళ్ల క్లియరెన్స్ కి సహజంగా మంత్రులు డబ్బులు డిమాండ్ చేస్తారు అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు మంచి ఆహారంగా మారగా అధికార పార్టీకి అది ఒక అవరోధం అయ్యింది. ఇక కొండా ఇంట్లో రేవ్ పార్టీ అంటూ వచ్చిన వివాదాలు అందుకు ఆ కుటుంబం చేసిన ప్రకటనలు మరోసారి కొండా సురేఖను వార్తలలో నిలిపింది.

* తీన్మార్ మల్లన…

ఈయన గారి రాజకీయం మొత్తం వివాదాలతోనే నడుస్తుంది అనిచెప్పొచ్చు. అధికార పార్టీ ఎమ్మెల్సీ గా ఉంటూనే అదే పార్టీ పై విమర్శలు చేస్తూ, ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూ, వారిని కించపరుస్తూ ఇలా నిత్యం ఏదోఒక వివాదంలో ఉంటూనే వస్తున్నారు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్.

ఇక కల్వకుంట కవిత మీద ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఒకసారి, బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో సందడి చేస్తూ మరోసారి, అలాగే బిసిల హక్కుల కోసమే TRP అంటూ ఇలా 2025 లో తెలంగాణ నుంచి మోస్ట్ కాంట్రవర్సి రాజకీయ నాయకుడిగా 2025 లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు మల్లన్న.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bigg Boss Telugu: Two Evictions Already In The House

For the first time in Bigg Boss history, there is a double eviction in the…

6 hours ago

Toxic English Version Flops: Yash’s Ramayana at Risk?

Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…

7 hours ago