
2028-29 Elections Set for Fierce Political Battles
ఇంతవరకు జరిగిన సార్వత్రిక ఎన్నికలన్నీ ఒక లెక్క.. 2028-29లో జరగబోయే ఎన్నికలు మరో లెక్క.. అని చెప్పక తప్పదు.
ముందుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల విషయానికి వస్తే ఈసారి ఖచ్చితంగా గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు బల్లగుద్ది చెపుతున్నారు.
ఒకవేళ రాలేకపోతే మరో ఐదేళ్ళలో వైసీపీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డి పోరాడటం ఖాయం. ఇందుకోసం కూటమి పార్టీలు కూడా ఊహించలేని రకరకాల వ్యూహాలు అమలు చేయడం ఖాయం.
అమరావతి, పోలవరంతో రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నందున వచ్చే ఎన్నికల్లో తప్పకుండా భారీ మెజార్టీతో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని కూటమి నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు కూడా వారికి అనుకూలంగానే ఉన్నాయి.
ఏపీలో జరుగుతున్న ఈ అభివృద్ధి ఆగకుండా మరింత వేగం పుంజుకోవాలంటే కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉందనే వారి వాదనను ప్రజలు కూడా కాదనలేరు. కనుక కూటమి-వైసీపీల మధ్య ఈసారి మరింత భీకరంగా ఎన్నికల పోరు జరగడం ఖాయం.. ఆ ఎన్నికలకు ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ట్రైలర్ లాంటివని చెప్పవచ్చు.
ఈ స్థాయి ఎన్నికలే ఇంత భీకరంగా జరిగినప్పుడు, వైసీపీ, కూటమి పార్టీల మనుగడతో ముడిపడున్న సార్వత్రిక ఎన్నికలు మరెంత భీకరంగా జరుగుతాయో ఊహించలేము.
తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డికి, తిరుగేలేదనుకుని ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకు, పశ్చిమ బెంగాల్ తర్వాత ఈసారి తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని కృత నిశ్చయంతో ఉన్న బిజేపిల మధ్య 2028 శాసనసభ ఎన్నికల్లో భీకర పోరాటాలు తప్పవు.
ముఖ్యంగా అధికార మార్పిడి జరిగితే పగ, ప్రతీకారాలకు బలైపోయే దారుణ పరిస్థితి నెలకొని ఉంది కనుక 2028-29 ఎన్నికలు మరో స్థాయిలోనే ఉంటాయి.
India had a good start with the ball on Day 1 of the first Test…
Adivi Sesh is reportedly joining hands with director Rahul Ravindran for his next project. The…