Telugu

వైకాపా ఎంపీల రాజీనామా – టీడీపీకి సంకటమా?

కేంద్రం తీరు మారకపోతే తమ ఎంపీలు పార్లమెంటు సమావేశాల చివరిరోజు మూకుమ్మడిగా రాజీనామానాలు చేస్తారని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినట్టుగానే సభ వాయిదా పడగానే వైకాపా ఎంపీలు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌‌కు రాజీనామా పత్రాలు సమర్పించారు.

ADVERTISEMENT

కాసేపట్లో వైకాపా ఎంపీలు ఏపీ భవన్‌లో దీక్షలో కూర్చోనున్నట్లు సమాచారం. మరోవైపు వారి రాజీనామాలు ఆమోదిస్తే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. ఆ రాజీనామాలు ఆమోదం పొందితే టీడీపీపై కూడా ఒత్తిడి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాజీనామాలు ఆమోదం పొంది ఉపఎన్నికలు వస్తే పోటీ చెయ్యడం టీడీపీకి అంత తేలికైన విషయం కాదు.

ఒకవేళ టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్తే సాధారణ ఎన్నికల ముందు ఇది సెమీ ఫైనల్ సమరంలా ఉండబోతుంది. రాజీనామాలు చేసే అవకాశం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. రాజీనామాల వల్ల ఉపయోగం ఉండదని, ఆలా చేసి వచ్చేస్తే పార్లమెంట్ తరువాత సిట్టింగులలో పోరాడేది ఎవరు అనేది ఆయన ప్రశ్న. సభ వాయిదా పడ్డాక రాజీనామాల పై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం లేదని, తరువాత సిట్టింగులో ఒక నిర్ణయం తీసుకున్నా ఉప ఎన్నికలకు అవకాశం ఉండకపోవొచ్చని నిపుణుల అభిప్రాయం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Toxic Washout Overseas: Fairy Tale Turns into Scary Tale?

Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…

4 hours ago

Dulquer’s Plot Leaked Before Release: BMS Responsible?

Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…

4 hours ago