
కమెడియన్ శ్రీనివాసరెడ్డి – వెన్నెల కిషోర్ ల మధ్య జరిగే హార్రర్ కామెడీ సంభాషణ వీక్షకులను అలరిస్తోంది. తాప్సీ ప్రధాన పాత్రలో నటించగా, ఇతర కీలక పాత్రల్లో నటించిన ఆర్టిస్టులను రివీల్ చేస్తూ వదిలిన ఈ మోషన్ పిక్చర్ కు కూడా మంచి స్పందనే వస్తోంది. ముఖ్యంగా తమ సినిమాను ప్రేక్షకులకు చేరువ అయ్యేలా చేస్తోన్న ఈ పబ్లిసిటీ సినిమాకు చాలా ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. ఎంత మంచి చిత్రం తీసినా, దానిని ప్రేక్షకులకు చేరువ అయ్యేలా చేయకపోతే… వాటి ప్రయోజనం శూన్యం.
కానీ “ఆనందో బ్రహ్మా” చిత్ర యూనిట్ చేస్తోన్న పబ్లిసిటీ బాగుంది. ఇది ఆడియన్స్ కు చేరువ కావడంతో, ఒక రకమైన పాజిటివ్ బజ్ అటు ప్రేక్షకులలోనూ, ఇటు ఇండస్ట్రీ వర్గాలలోనూ ఏర్పడుతుంది. ‘గీతాంజలి’ తర్వాత శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రలో నటించిన “జయమ్ము నిశ్చయమ్మురా” సినిమా అంతగా ప్రజాధరణ పొందన్నప్పటికీ, మరోసారి “ఆనందో బ్రహ్మా” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక కామెడీ టైమింగ్ కింగ్ వెన్నెల కిషోర్ ఎలాగూ ఉండనే ఉన్నాడుగా..!
A roulette wheel, a casino floor and a group of young people looking for a…
రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ కుటుంబ కంచుకోటగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న పులివెందులలో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ…