Telugu

పులివెందుల వైసీపీ ఓటమి…జగన్ కు టీడీపీ రిటర్న్ గిఫ్ట్.?

రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ కుటుంబ కంచుకోటగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న పులివెందులలో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పులివెందుల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది.

టీడీపీ అభ్యర్థి గీతా కుమారి తన సమీప వైసీపీ ప్రత్యర్థిపై 13 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 40 వార్డుల్లో వైసీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితం కాగా, మిగిలిన వార్డుల్లో కూటమి అభ్యర్థులు ఆధిపత్యం ప్రదర్శించారు.

ADVERTISEMENT

ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉన్న పులివెందులలో ఈ ఫలితాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. జగన్ సొంత నియోజకవర్గంలోనే వైసీపీకి ఎదురైన ఈ పరాజయం ఆ పార్టీకి గట్టి రాజకీయ ఎదురుదెబ్బగా మారింది.

అయితే పులివెందులలో వైసీపీ ఈ ఓటమి జగన్ కు టీడీపీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అవుతుందా.? అన్న చర్చ ఊపందుకుంది. నాటి కుప్పంలో వైసీపీ గెలుపుకి నేడు పులివెందులలో టీడీపీ విజయంతో బాబు లెక్క సరిచేసారా.?

పులివెందులలో వైసీపీ గెలుపు కోసం జగన్ తన సొంత పిన్నమ్మ ప్రమీలమ్మనే బరిలోకి దింపినా వైసీపీ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది అంటే ఆ ఓటమి బాధ్యత ఎవరిదీ.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pocket Rockkets Teaser: Money and Ambition

A roulette wheel, a casino floor and a group of young people looking for a…

3 minutes ago

NTR To Launch Itlu Arjuna Trailer

Aniesh’s debut flick Itlu Arjuna has generated enough enthusiasm through its glimpse, teaser and songs.…

23 minutes ago