
అయితే అదే అమీర్ ఖాన్, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రాజమౌళి ‘బాహుబలి 2’ సినిమాను అధిగమించేసాడు. ఇటీవల చైనాలో విడుదలైన అమీర్ ఖాన్ “దంగల్” సినిమా అపూర్వ విజయం సాధించడంతో, వెయ్యి కోట్లు అందుకున్న రెండవ సినిమాగా నిలిచింది. అలాగే తాజాగా 1500 కోట్ల మార్క్ ను కూడా టచ్ చేసి, ‘బాహుబలి 2’ను ఓవర్ టేక్ చేసిన తర్వాత గానీ, అమీర్ ఖాన్ ‘బాహుబలి 2’ గురించి స్పందించలేదు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యక్తులంతా చెప్పారు గానీ, ఖాన్ త్రయంలో ఒక్క షారుక్ మాత్రమే చెప్పడంతో అమీర్, సల్మాన్ లు స్పందించలేదు.
ఎట్టకేలకు నోరు విప్పిన రాజమౌళి ‘డ్రీం హీరో’ అమీర్… “ఇంతవరకు ‘బాహుబలి 2’ సినిమా చూడలేదు గానీ, చాలా విన్నానని, ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు సినిమాలు దూసుకుపోవడం హర్షించదగ్గ విషయమని, అయితే ఈ రెండింటి సినిమాల విజయం వేరని, తన సినిమాకు, బాహుబలి 2 సినిమాకు అసలు పోలిక లేదని తెలిపారు. “బాహుబలి 2” సినిమా ఘనవిజయానికి చిత్ర దర్శకుడు రాజమౌళి మరియు చిత్ర బృందానికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు అమీర్. ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్ “సచిన్ – ఎ బిలియన్ డ్రీమ్స్” సినిమా ప్రీమియర్ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసారు ‘మిస్టర్ పర్ ఫెక్ట్.’
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…