
ఈరోజు ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైనప్పుడు కూడా ‘ఆరా మస్తాన్’ సాక్షి న్యూస్ ఛానల్ ఎన్నికల ఫలితాలపై జరిగిన విశ్లేషణా కార్యక్రమంలో మాట్లాడుతూ, “నేను చాలా లోతుగా అధ్యయనం చేసి ఖచ్చితమైన లెక్కలతో ఈసారి వైసీపికి 94 నుంచి 104 సీట్లు గెలుచుకోబోతోందని చెప్పాను. అంతకంటే ఇంకా ఎక్కువ సీట్లే వస్తాయి తప్ప ఒక్క సీటు కూడా తగ్గే అవకాశమే లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మళ్ళీ ఇదే స్టూడియోలో కూర్చొని నా లెక్కలకు కారణాలు మీకు వివరిస్తాను,” అని చెప్పారు.
ఒకవేళ ఈ ఎన్నికలలో వైసీపి ఓడిపోతే జీవితంలో మళ్ళీ ఎన్నడూ ఎన్నికల సర్వేలు చేయనని ఆరా మస్తాన్ సవాలు కూడా చేశారు. ఆయనతో పాటు మరికొందరు వైసీపి అభిమాన విశ్లేషకులు కూడా వైసీపి ఏవిదంగా ఎందుకు గెలవబోతోందో వివరించారు.
కానీ వారివన్నీ కాకిలెక్కలే అని ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. శాసనసభ ఎన్నికలలో టిడిపి: 6 సీట్లు గెలుచుకొని మరో 126 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. జనసేన 20 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ ఒక సీటు గెలుచుకొని మరో 6 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. కానీ వైసీపి 17 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా ఇంతవరకు ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.
లోక్సభ ఎన్నికలలో కూడా టిడిపి ఏకంగా 16 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా జనసేన 2, బీజేపీ 3 కలిపి మొత్తం 25కి 21 సీట్లు గెలుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపి కేవలం 4 స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
ఈ నేపధ్యంలో ఆరా మస్తాన్ తదితరుల కాకి లెక్కల వీడియోని ఇప్పుడు రీప్లే చేసి చూస్తే బ్రహ్మానందం కంటే మంచి కామెడీ సీన్స్ చూసిన్నట్లు అనిపించక మానదు.
“వివేకా హత్య కేసుతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఆ ఆరోపణలతో నేను చాలా ఆవేదన అనుభవిస్తున్నాను. నేను ఏ…
Allu Arjun and Lokesh Kanagaraj’s AA23 has reportedly undergone a change in its promotional plans,…