
ఒక మొండి పిల్ల ఎప్పుడూ ఇంటి నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఒకసారి ఆమెను ఇంటి నుండి ఒక కనపడని దెయ్యం తప్పిస్తుంది. గతంలో అవును, అవును 2 లో కూడా అదే కనపడని దెయ్యం కాన్సెప్టు నే వాడాడు రవిబాబు. ట్రైలర్ చూడగానే రొటీన్ ఫీలింగ్ కలిగింది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సీనియర్ నిర్మాత దిల్ రాజు సినిమాను విడుదల చేయబోతున్నారు.
ఈ మధ్య రవిబాబు సినిమాలను సురేష్ బాబు విడుదల చేశారు. ఇప్పుడు దిల్ రాజు కు మారారు. దిల్ రాజు లక్ ఏమైనా రవిబాబుకి కూడా అంటిస్తారేమో చూడాలి. దిల్ రాజు ఒక సినిమాతో కలిశాడంటే ఆ సినిమాలో ఎంతో కొంత విషయం ఉన్నట్టే. చూడాలి ఏమవుతుందో.
నవంబర్ 1న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దిల్ రాజు సినిమా కాబట్టి మంచి రిలీజ్ ఉంటుంది. పబ్లిసిటీ కి అయితే ఎటు వంటి ఢోకా ఉండదు. అయితే ఆవిరికి విజయ్ దేవరకొండ నిర్మాతగా చేస్తున్న మొదటి సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’ తో ఆరోజున పోటీ పడబోతోంది.
Indian travellers flying through Europe have received major relief after France removed a visa rule…
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…