
ప్రస్తుతం టి-20 క్రికెట్ ను శాసిస్తున్న జట్టు ఏది అనే ప్రశ్న కు అభిమానులు పెద్దగా ఆలోచించకుండానే చెప్పే మాట ‘టీం ఇండియా’. అయితే, ఇంత వన్-సైడెడ్ గా ఈ టాక్ ఎలా వస్తుదనే ప్రశ్న కు కూడా అభిమానులు తమ బుర్రలకు పెద్దగా పని పెట్టనవసరం లేదు.
బౌలింగ్-ఫీల్డింగ్ భాగాలు మిగతా టాప్-క్లాస్ టీమ్స్ రీతిలోనే ఉన్నప్పటికీ, బ్యాటింగ్ లో మాత్రం మనవాళ్ళు ఎవ్వరు అందుకోలేని ఎత్తులో ఉన్నారు. ఇక, టీం ఇండియా బ్యాటింగ్ అనగానే మొదటి మదిలో మెదిలే పేరు-‘అభిషేక్ శర్మ’. పంజాబ్ కు చెందిన ఈ కుర్రాడు నేడు టి-20 ఫార్మటు ను ఏలుతున్నాడంటే అది అతిశయోక్తి కాదు.
దొరికినిలకడగా ఆడితే స్ట్రైక్ ఉండదు, భారీ హిట్టింగ్ చేస్తే నిలకడ ఉండదు. ఇది మాములుగా అందరు అనే మాట, కానీ అభిషేక్ శర్మా ఈ వాదనలో నిజం లేదని నిరూపిస్తున్నాడు. భారీ హిట్టింగ్ చేస్తూ, ఆ హిట్టింగ్ ను నిలకడగా ప్రతి మ్యాచ్ లో కొనసాగిస్తూ, తన స్థానాన్ని అభిమానుల గుండెలో కాకుండా అపోజిషన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పనిలో ఉంటున్నాడు.
అయితే ఒక్క అభిషేక్ శర్మ తో నే టీమ్ ఇండియా కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిందనుకొనేలోపే, ఝార్ఖండ్ నుండి మరో పటాకా ఊడిపడింది. అసలు అప్పటి వరుకు అంతర్జాతీయ ఫార్మటు కు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ రంజీ మరియు విజయ్ హజారే లో చిచ్చరపిడుగు వలె రెచ్చిపోయి బ్యాటింగ్ చేసి టి-20 వరల్డ్ కప్ జట్టులో ఎవ్వరు ఊహించని విధంగా ఎంపికయ్యాడు.
కానీ, అప్పటికి అతని పాత్ర కేవలం బ్యాక్-అప్ వికెట్ కీపింగ్ కమ్ బాట్స్మన్. ఇంతలో తిలక్ వర్మ కు సర్జరీ అవటం ఏంటి, ఇషాన్ కు చోటు దొరకటం ఏంటి, అదే సమయానికి సంజు ఘోరమైన ప్రదర్శన చేయటం ఏంటి.. ఆ వచ్చిన అవకాశాన్ని ఇషాన్ రెండు చేతులతో పట్టుకోటమే కాదు, ఆ పట్టుకున్న చేతులతోనే తనకు కావాల్సిన ఆ వికెట్-కీపింగ్ బ్యాటర్ రోల్ ను కూడా సొంతం చేసుకున్నాడు.
న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో ఇషాన్ ఎవ్వరు కలలో కూడా ఊహించని ఒక అదిరిపోయే ప్రదర్శన కనబరిచి తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకుని టి-20 వరల్డ్ కప్ లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అయితే, ఒక ఇషాన్-అభిషేక్, ఈ ఓపెనింగ్ జోడి ను తలుచుకుంటేనే అపోజిషన్ గుండెల్లో రాళ్లు పడుతున్నాయ్.
త్వరలో, ఈ ఇద్దరు మెంటలోళ్ళకి తోడు మరొక చిచ్చరపిడుగు వస్తే ఇంకెలా ఉంటుంది..? ఇప్పటికే ఐపీఎల్, దేశవాలి, అండర్-19 వరల్డ్ కప్, ఆసియ కప్ వంటి అనేకానేక లీగ్స్ లో అత్యుత్తమ ప్రదర్శన చూపి నిన్న భారత్ అండర్-19 ట్రోఫీ గెలవటానికి కారణమైన ‘వైభవ్ సూర్యవంశీ’ అంతర్జాతీయ డెబ్యూ కు ఎక్కువ సమయం లేదేమో అనిపిస్తుంది.
కళ్ళు చెదిరిపోయే హిట్టింగ్ తో, అలవోకగా సిక్సర్లు బాధేస్తు ఏకంగా ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ లో 175 పరుగులు చేయటమే కాకుండా ఆ 175 పరుగులను కేవలం 80 బంతుల్లో అందుకుని, అందులో 15 – 4లు, 15 – 6లతో ఏకంగా 150 పరుగులను కేవలం బౌండరీలతోనే సాధించాడు ఈ 14 ఏళ్ళ చిచ్చరపిడుగు.
ఇప్పటికే ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కు ఆడుతున్న ఈ యువకుడు, తొలి ఐపీఎల్ సీజన్ లోనే ఎందరో మహాఘనులైన అంతర్జాతీయ బౌలర్లను ఎదుర్కున్న అనుభవమో ఏమో కానీ, ఈ అండర్-19 ట్రోఫీ ఫైనల్ లో ఇంగ్లాండ్ బౌలర్లను పసి కూనల వలె డామినేట్ చేసేసాడు. అయితే, ప్రస్తుత టీం ఇండియా టి-20 సెట్ అప్ కు వైభవ్ ఏ మేరకు మ్యాచ్ అవుతాడని అనుకుంటున్నారు..?
Chiranjeevi could be heading for a very unusual Sankranti season. If the latest industry buzz…
Rajinikanth’s Jailer 2 is reportedly facing a censor hurdle just weeks before its scheduled release.…