Telugu

అభి ఆడుతుంటే యువీ గుర్తొస్తున్నాడుగా..!

భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ – 20 సిరీస్ ఇప్పటికే 3-0 తో భారత్ కైవశం చేసుకుంది. అయితే ఇక ఆ మిగిలిన 2 మ్యాచ్లు నామమాత్రం కావడంతో భారత్ ప్రయోగాలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది.

అయితే భారత్ మొదటి నుంచి కూడా పొట్టి ఫార్మాట్ లో చాల బలంగా ఉన్నమాట వాస్తవం. అయితే ఆ బలాన్ని ఇలా ఏకపక్ష పోరాటాలుగా మార్చిన క్రెడిట్ మాత్రం టీం ఇండియా యువ ఆటగాళ్లదనే చెప్పాలి. అందులో ఈ సిరీస్ లో తన బ్యాట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడిగా అభిషేక శర్మ నిలిచారు.

ADVERTISEMENT

2017 అండర్-19 భారత జట్టు ను ఆసియా కప్ లో విజేతలుగా నిలబెట్టిన కెప్టెన్ అభిషేక్. కానీ, అదే ఫామ్ లో ఐపీఎల్ కు వచ్చినప్పుడు అభిషేక్ ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడనే చెప్పాలి. 2018 ఐపీఎల్ సీజన్ కోసమై ఢిల్లీ కాపిటల్స్ జట్టు అభి ను ఎంపిక చేసుకోగా, వచ్చిన కొన్ని అవకాశాలలో మేనేజ్మెంట్ ను ఇంప్రెస్ చేసే పెర్ఫామెన్స్ ఇవ్వటంలో అభి విఫలమయ్యాడు.

ఇక అదే ఫామ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చినప్పటికీ అక్కడ కూడా మొదట అనుకున్న సక్సెస్ ను చూడలేకపోయాడు అభిషేక్. అయితే దీనితో అందరూ ఇక తన చాప్టర్ ముగిసిందనుకున్నారు. కానీ, అప్పుడే తన జీవితంలో అతి పెద్ద పాత్రగా ఒక యోధుడు అతని కథలోకి అడుగు పెట్టారు.

మాజీ భారత ఆల్-రౌండర్, ప్రపంచ కప్ విజేత, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని జయించి ప్రపంచ క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఆటగాడు, తోటి పంజాబ్ రాష్ట్ర క్రీడాకారుడు ‘యువరాజ్ సింగ్’ స్వయంగా వచ్చి అభిషేక్ శర్మ ను శిష్యుడిగా ఎంచుకున్నాడు.

అప్పటివరకు దేశవాళీ టోర్నీలలో అద్భుతంగా రాణించినప్పటికీ ,ఐపీఎల్ వంటి అంతర్జాతీయ ఎక్స్పోజర్ ఉన్న లీగ్ తో సక్సెస్ అవ్వటంలో కాస్త వెనకబడిన అభిషేక్ ను ఒక సమర్ధవంతమైన యోధునిలా, రెండు వైపులా బాగా సానబెట్టిన కత్తి లా అభిషేక్ ను తయారుచేసాడు.

ఆ సాన ఇప్పుడు గురువు గారి రికార్డులకే ఎసరు పెట్టే స్థాయికి చేరింది. నిన్న జరిగిన మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ పై పూర్తిగా పైచేయి సాధించిన సంగతి అందరికి తెలిసిందే. అటు బౌలింగ్ విభాగంలో బౌలర్లు రాణించి ఆ జట్టు స్కోర్ ని 153 కి పరిమితం చేస్తే,

ఇక బ్యాటింగ్ విభాగం తమ బ్యాటింగ్ ఉచకోతతో ఆ లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్ల లోనే ఛేదించి పొట్టి ఫార్మాట్లో కొత్త రికార్డులను నమోదుచేసింది. ఆ రికార్డుల వెనుక ఉన్న ఆ ఆంజనేయుడు మన అభిషేక శర్మ. కేవలం 14 బంతులలోనే 50 సాధించి తన గురువు యువి రికార్డు కు అత్యంత దగ్గరగా వచ్చారు.

2007 లో జరిగిన మొట్టమొదటి టీ – 20 వరల్డ్ కప్ లో భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఫ్లింటాఫ్ బౌలింగ్ లో యువరాజ్ ఏకంగా ఆరు బంతులకు ఆరు సిక్స్ లు బాది12 బంతులలోనే అర్ధ శతకం నమోదు చేసారు. దీనితో అతి తక్కువ బౌల్స్ లో 50 కొట్టిన తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించారు యువి.

ఆ రికార్డు నమోదయ్యి నేటికీ 19 ఏళ్ళు గడిచిన యువి రికార్డు ఇప్పటికి చెక్కుచెదరకుండా అలానే కొనసాగుతుంది. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో అంటే 14 బంతులతో అర్ధ సెంచరీ సాధించి గురువు గారి రికార్డు కి అతి చెరువులోకి వచ్చాడు అభి.

ఈ సందర్భంగా యువి తన సోషల్ మీడియాలో ఒక సరదా ట్వీట్ వేశారు. “ఇప్పటికి 12 బంతులతో ఫిఫ్టీ చేయలేకపోయావ్…సర్లే వెల్ ప్లేయ్డ్”…అంటూ తన శిష్యుడి ఆటతీరు పై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసారు సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్.

దీనితో గ్రౌండ్ లో అభి ఆడుతుంటే యువి గుర్తుస్తున్నాడు అంటూ యువి అభిమానులు అభి పై తమ అభిమానాన్ని కురిపిస్తున్నారు. అభిషేక్ శర్మ ఇలానే తన ఫామ్ ని కొనసాగించగలిగితే అతి తొందరలోనే యువరాజ్ 12 బంతులతో 50 పరుగుల రికార్డు ని కూడా తన పేరిట మార్చుకుని తన గురువు యువీకి ఆ రికార్డు ని గురు దక్షిణ ఇస్తారేమో చూడాలి.!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bigg Boss Telugu: Two Evictions Already In The House

For the first time in Bigg Boss history, there is a double eviction in the…

6 hours ago

Toxic English Version Flops: Yash’s Ramayana at Risk?

Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…

7 hours ago