
ఈ సందర్భంగా షోలో తన స్నేహితుడు ఆదర్శ్, అర్చనలతో పిచ్చాపాటి మాట్లాడుతూ… తాను ఎనిమిదేళ్లు ప్రేమలో ఉన్నానని చెప్పాడు. అయితే మధ్యమధ్యలో అభిప్రాయభేదాలతో తామిద్దరం దూరమయ్యే వాళ్లమని, మళ్లీ కలిసే వాళ్లమని, అయితే తనకు ఇంత వరకు ‘ఈ అమ్మాయితో ఉంటే చాలు, జీవితంలో ఇంకేదీ అవసరం లేదనిపించలేదని’ చెప్పాడు. అమ్మాయిలు ప్రేమిస్తే అదే లోకంగా ఉంటారని, ఒక్కసారి బ్రేకప్ అంటే మాత్రం కనీసం అటు వైపు కూడా కన్నెత్తి చూడరని తన ప్రేమ సంగతులను వివరించాడు.
ఇక ప్రిన్స్ మాటలు విన్న హీరోయిన్ అర్చన తన ప్రేమ సంగతి కూడా బయట పెట్టింది. తాను అయిదేళ్ళు రిలేషన్ లో ఉన్నానని, మధ్యమధ్యలో బ్రేకప్ కూడా అయ్యేదని, కానీ ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్నానని, ఆ సమయంలో చాలా ఏడ్చేదానని, ఒక జీవితానికి కావాల్సిన అనుభవాలన్నీ ఆ ప్రేమలో అనుభవించేశానని చెప్పింది. ఇప్పుడు తాను ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోగలనని, వాటి ఫలితాన్ని తన మనసు వరకు రానివ్వలేనని, తానెంత అటాచ్డ్ గా ఉంటానో అంతే డిటాచ్డ్ గా కూడా ఉండగలనని చెప్పుకొచ్చింది.
For Congress, the November 1 rally at Delhi's Ramlila Maidan was an opportunity to show…
The Tiger Shroff firing incident appears to have changed more than just the security arrangements…