Telugu

తప్పు దిద్దుకునే బాధ్యత లేదా.?

సినిమాలు..రాజకీయాలు అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న కొంతమంది సినీ నటులు రాజకీయాల కోసం సినీ గ్లామర్ ను వాడుకుంటున్నారు, అలాగే సినీ ఫంక్షన్స్ లో రాజకీయాలను చేస్తూ రెంటికి అప్రతిష్ట తీసుకువస్తున్నారు.

తాజాగా విశ్వక్, లైలా మూవీ ఫ్రీ రిలీజ్ కార్యక్రమంలో భాగంగా 30 ఇయర్స్ పృథ్వి చేసిన కామెంట్స్ ఆ మూవీ మీద ప్రభావం చూపాయి. సినిమా మొదట్లో మొత్తం 150 గొఱ్ఱెలుండేవి, అయితే క్లైమాక్ కు వచ్చే సరికి ఆ సంఖ్య 11 కి చేరింది అంటూ పృథ్వి చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా వైసీపీ ని టార్గెట్ చేసేవిగా ఉండడంతో ఇక పార్టీ మద్దతుదారులంతా బాయ్ కాట్ లైలా # ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

ADVERTISEMENT

దీనితో ఆ వ్యాఖ్యలకు తమకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఆ చిత్ర హీరో విశ్వక్, నిర్మాత సాహు ఈ # ట్రెండ్ చేస్తున్న వారికీ క్షమాపణలు చెపుతూ, ఎవరో ఒకరు చేసిన తప్పుకి ఇన్ని కోట్లు డబ్బులు పెట్టి సినిమా తీసినవారిని నష్టపరుస్తారా.? సినీ ఇండస్ట్రీ అంటే అందరికి ఈజీ టార్గెట్ అయిపోయిందా.? అంటూ ఆవేదన చెందారు.

అయితే తనను నమ్మి కోట్లు ఖర్చుపెట్టిన నిర్మాతకు నష్టం కలగకూడదనే ఆలోచనతో హీరో విశ్వక్ సేన్ పృథ్వి చేసిన పనికి తన తప్పు లేకపోయినా, ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం ఉండక పోయినా మీడియా ముందుకు వచ్చారు, అలాగే సదరు మాటలతో బాధపడిన వారికీ, మనోభావాలు దెబ్బ తిన్నవారికి బహిరంగ క్షమాపణలు కోరారు. అలాగే చిత్ర నిర్మాత కూడా అదే విధంగా హీరో తో కలిసి క్షమాపణలు చెప్పారు.

అయితే ఈ వివాదానికి మూల కారకుడైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వి మాత్రం ఇంతవరకు స్పందించలేదు. తనకు సినిమాలో అవకాశం ఇచ్చి, అందుకు తగ్గ రెమ్యునరేషన్ అందించి, తన కెరీర్ ముందుకు సాగడానికి తోడ్పడిన మూవీ పై తన నోటి దూల ఫలితంగా మూవీ పై సోషల్ మీడియాలో ఇటువంటి ప్రచారం జరుగుతున్నప్పటికీ పృథ్వి నోరు మెదపక పోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది.

వైసీపీ మత్తులో రాజకీయాలలోకి ప్రవేశించిన కొత్తలో తనకు అప్పటి వరకు అవకాశాలు కల్పించిన సినీ ప్రముఖుల మీద నోరు పారేసుకుని కొన్నేళ్ల పాటు ఇటు చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు పృథ్వి. మళ్ళీ ఇప్పుడు వైసీపీ చేసిన అవమానాలతో బయటకొచ్చి జనసేనలో చేరి సినీ వేదికల మీద రాజకీయ విమర్శలు చేస్తూ మరోసారి ఇండస్ట్రీ వారిని బాధిస్తున్నారు.

దీనితో కడుపు నింపినోడి కడుపు కొడతారా.? ఆ మూవీ సక్సెస్ మీ బాధ్యత కాదా.? తప్పుదిద్దుకునే అవసరం లేదా.? అంటూ పృథ్వి వ్యవహారశైలి మీద విమర్శలు మొదలయాయ్యి. ఇలా సమయం సందర్భం లేకుండా, వేదికలతో సంబంధం లేకుండా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ అనుభవం గురించి చెప్పుకునే పృథ్వి ఆలోచనతో మెలగాలే తప్ప ఇలా అనవసరమైన విధానాలతో నోరు పారేసుకుని ఇండస్ట్రీకి మరి ముఖ్యంగా చిన్న సినిమాలకు నష్టం చేకూర్చరాదు.

ఇలా అయితే ఇటు ఇండస్ట్రీలో రానున్న రోజులలో పృథ్వికి వచ్చే వేషాలు కూడా తగ్గే అవకాశం ఉంది. అలాగే అటు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కూడా సినీ పరిశ్రమలో స్టార్ హీరో నే కాబట్టి, ఇటువంటి వారి వ్యాఖ్యలు అటు జనసేనకు కూడా కొత్త తలనొప్పులు తెచ్చిపెడతాయి. దీనితో ఇన్నాళ్లు సినిమా, రాజకీయాలు అంటూ ‘రెండు పడవల మీద ప్రయాణం’ చేస్తున్న పృథ్వి ఇక ‘రెంటికి చెడ్డ రేవడి’ మాదిరి దోషిగా నిలబడాల్సి ఉంటుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Is AA23 in Trouble? Allu Arjun’s Camp Responds

Reports about Allu Arjun and Lokesh Kanagaraj’s AA23 hitting a roadblock have created fresh confusion…

1 hour ago

Reporting Live Review: An Absolute Disaster, Nothing Works

BOTTOM LINE An Absolute Disaster, Nothing Works PLATFORM Netflix RUNTIME 2 Hours What Is the…

2 hours ago