
ఏ హీరో వేడుక జరిగితే, ఆ హీరోనే తన అభిమాన హీరో అంటూ అభిమానులను ఉత్తేజ పరచడానికి యాంకర్లు పడే తిప్పలు అన్ని ఇన్ని కావు. అయితే హీరోలతో సహా వాటిని ఎవరూ సీరియస్ గా తీసుకోరు. ఫ్యాన్స్ అయితే రకరకాల వేడుకలు చూసి ఉంటారు కాబట్టి, చాలా లైట్ గా తీసుకుంటారు గానీ, బన్నీ మాత్రం సీరియస్ గా తీసుకున్నారు.
“ఒక్క క్షణం” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకరింగ్ చేసిన హరితేజ… తన అభిమాన హీరో అల్లు అర్జున్ అంటూ వివిధ సందర్భాలలో స్టేజ్ పైన చెప్పింది. దీంతో తన ప్రసంగం చివర్లో… హరితేజను చాలా బాగా యాంకరింగ్ చేసావు అంటూ అభినందించిన బన్నీ… “ఫ్యాన్ అన్నారు, ఇతర వేడుకల మీద వేరే హీరో పేరు చెప్తే అప్పుడు నేను ఫోన్ చేస్తా…” అంటూ చమత్కరించాడు.
వెంటనే స్పందించిన హరితేజ….”ఎనీ సెంటర్ మీ పేరే” అంటూ బదులిచ్చింది. దీంతో వేరే హీరోల ఈవెంట్స్ ను ఆర్గనైజ్ చేసేటపుడు హరితేజ మిక్కిలి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. పొరపాటున ‘టంగ్ స్లిప్’ అయ్యిందో బన్నీ నుండి ఫోన్ రావడం మాత్రం ఖాయం. ఒకవేళ బన్నీ నుండి కాల్ రావడానికైనా అలా చేస్తుందేమో చూడాలి.!
Telangana is planning a massive new cricket stadium in Bharat Future City near Hyderabad. The…
Art director and TTD Board Member Anand Sai’s son Sandeep has been arrested by Cyberabad…