Telugu

అదంతా పైడ్ సర్విసా….?

భామకలాపం -2 తో ఓటిటీ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రియమణి పపరాజీ కల్చర్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పపరాజీ అంటే ఫోటోలు తీయడం అట. ఈ మధ్యకాలంలో జిమ్ సెంటర్ల దగ్గర, ఎయిర్ పోర్ట్ ల దగ్గర హీరోహీన్లు, సెలబ్రెటీ హోదాలు ఉన్న వ్యక్తులు కనిపిస్తే ఫొటోగ్రాపర్స్ క్లిక్ క్లిక్ అంటూ తమ కెమెరా బట్టన్ తెగ నొక్కడం అందరూ గమనిస్తూనే ఉన్నారు.

అయితే కరెక్టుగా సదరు నటీమణి బయటకు రాగానే ఎప్పటి నుంచో ఆమె కోసమే ఎదురుచూస్తున్నట్టుగా ఆ ఫోటోగ్రాఫర్ తన కెమెరాకు పని చెప్పడం, ఆ అమ్మడు ఫోటోలకు పోజులివ్వడం, వాటిని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడం చెకచెకా జరిగిపోతూ ఉంటుంది. వీటిని చూసిన నెటిజన్లు మాత్రం కెమెరామన్ టైమింగ్ కు ఒక లైక్ కొట్టి ఆ ఫోటోలను వైరల్ చేస్తుంటారు.

ADVERTISEMENT

అయితే ఇప్పుడు వీటి మధ్య ఉన్న సీక్రెట్ ను బయటపెట్టారు ప్రియమణి. ఈ ప్రక్రియ మొత్తం ఒక పైడ్ సర్వీస్ అని…ఇదంతా సదరు సెలబ్రెటీలు డబ్బులిచ్చి సొంతంగా తీయించుకుంటారని ఒక పాడ్ కాస్ట్ లో అనుమప గుమగుమ అలియాస్ ప్రియమణి వివరించారు. జవాన్ మూవీ తరువాత ఒక ఏజెన్సీ ద్వారా ఈ పపరాజీ కల్చర్ గురించి తెలుసుకున్నానని చెప్పారు.

అలాగే ఈ కల్చర్ కోసం సదరు సెలబ్రెటీలు ఎంత మొత్తంలో ఖర్చు చేస్తున్నారో కూడా ఆ ఏజెన్సీ వ్యక్తి తనకు చెప్పారన్నారు. దీనితో ఆ ఖర్చు చూసి తానూ ఆశ్చర్యపోయానంటూ ప్రేక్షకులకు తెలియని సెలబ్రెటీల ఒక టాప్ సీక్రెట్ ను బయటపెట్టారు ప్రియమణి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

‘జైలర్ 2’ సినిమా రివ్యూ: సెకండాఫ్ సిండ్రోమ్ తో బాధపడ్డ జైలర్ సాబ్!

చిత్రం: జైలర్ 2 M9 రేటింగ్: 2.5/5 విడుదల తేదీ: అక్టోబర్ 15, 2026 తారాగణం: రజనీకాంత్, ఎస్.జే.సూర్య, రమ్యకృష్ణ,…

4 minutes ago

Is Anupama’s Personal Pain Affecting Her Work?

Personal struggles can sometimes affect professional relationships, even when someone tries to keep the two…

16 minutes ago