
ఇన్నాళ్లుగా జగన్ అక్రమాలు, అతని మీద కేసులు ఒక్క తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అనుకున్న వారికి జగన్ బ్రాండ్ వాల్యూ తెలిసేలా చేసాయి బడా వ్యాపార వేత్త అదానీ మీద అమెరికాలో నమోదైన కేసులు.
అక్రమాలు ఎక్కడుంటే వైసీపీ అక్కడుంటుంది, అక్రమ సంపాదన ఎక్కడ వస్తే అక్కడ జగన్ ఉంటాడు అనేలా అమెరికాలో అదానీ కేసుకి ఆంధ్రాలో జగన్ కి ఉన్న సంబంధాలు ఒక్కొక్కటిగా బయట ప్రపంచం ముందుకు వస్తున్నాయి.
అదానీ పై అమెరికాలో నమోదైన కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావన, గత వైసీపీ ప్రభుత్వం ఒప్పొందాలు పేర్కొనబడ్డాయి. అదానీ ఆనాటి ఏపీ ప్రభుత్వానికి 1750 కోట్ల లంచం ఇచ్చి సౌర విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు గత వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు.
అలాగే 2021 లో అదానీ అప్పటి ఏపీ ముఖ్యమంత్రి అయినా వైస్ జగన్ ను కలిసిన తరువాతనే ‘సెకీ’ ఒప్పందం కుదిరినట్టు ఆ కేసులో పేర్కొన్నారు. అదానీ పవర్ నుంచి కొన్న విద్యుత్ ఏపీకి ఇవ్వాలని ఈ ఒప్పందంలో పేర్కొనబడిందన్నట్లు స్పష్టమైన సమాచారం సేకరించారు అమెరికా విచారణాధికారులు.
దీనితో అదానీ నుండి 1750 కోట్ల లంచం తీసుకున్న ప్రభుత్వంగా వైసీపీ పేరు, ఆనాటి ముఖ్యమంత్రిగా జగన్ ప్రస్తావన అమెరికాలో నమోదయిన కేసులలో కూడా పేర్కొనబడ్డాయి. దీనితో పుష్ప సినిమాలో ఫేమస్ డైలాగ్ అయినా “పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరు” మాదిరి “జగన్ అంటే లోకల్ అనుకుంటున్నారా ఇంటర్ నేషనల్” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి.
అయితే ఎప్పటి మాదిరే ఈ ఆరోపణలను కూడా టీడీపీ కుట్ర అంటూ వైసీపీ కొట్టిపారేస్తుందా.? లేక ఇది కూడా చంద్రబాబు నాయుడి మీద నెపం నెట్టిస్తూ జగన్ చేతులు నలుపుకుంటారా.? ఇప్పటికే తన మీద నమోదైన అక్రమాస్తుల కేసుల పాపం బాబుదే అంటూ ప్రచారం చేసుకుంటున్న జగన్ ఇప్పుడు ఈ కేసు కూడా బాబు ప్రోద్బలంతోనే జరిగింది అంటూ చెప్పుకొస్తారా.?
Chiranjeevi's Vishwambhara has been waiting for its theatrical release for a long time. Fans are…
Vijay Deverakonda and Rashmika Mandanna visited Tirumala ahead of Ranabaali's release and offered prayers for…