
[m9ad]
సాధారణంగా ఎంత బోరింగ్ సినిమాలో అయినా చెప్పుకోవడానికి ఒకటో, రెండో విషయాలు హైలైట్స్ గా నిలుస్తాయి. కానీ ఈ “అదుగో”లో మాత్రం ఒక్కటి కూడా కానరాకపోవడం, రవిబాబు నుండి అస్సలు ఊహించినది కాదు. కధ, కధనం, నటీనటుల నటన, గ్రాఫిక్స్, కామెడీ… ఇలా ప్రతి ఒక్క విభాగంలోనూ “అదుగో” తీవ్రంగా నిరుత్సాహపరుస్తోందన్న టాక్ ను సొంతం చేసుకుంది.
ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ ప్రజెంట్ చేయడం మరో కొసమెరుపు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుండి వస్తున్న సినిమా అంటే, ‘మినిమం గ్యారెంటీ’ అన్న అభిప్రాయం ప్రేక్షకులలో ఉండేది. కానీ దానిని కూడా రూపుమాపే విధంగా ఈ సినిమా టాక్ రావడం, సదరు బ్యానర్ కూడా ఊహించని విషయమేమో! ఏది ఏమైతేనేం… మొత్తానికి “అదుగో” విడుదల అయితే అయ్యింది.
స్థానిక ఎన్నికలు టీడీపీ, జనసేన మధ్య రాజకీయ చిచ్చుకి కారణంగా మారతాయని, ఆ మంటలో తాము చలి కాచుకుందామని వైసీపీ…
Ramayana and Godzilla Minus Zero are heading towards a November showdown, but the real battle…